ఏపీలో అధికార వైసీపీని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా ఏర్ప‌డ్డ టీడీపీ - జ‌న‌సేన - బీజేపీ కూట‌మిలో అస‌లు ఏం జ‌రుగుతుందో ?  కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. అస‌లు ఏ మాత్రం గెల‌వ‌డానికి స్కోప్ లేని సీట్ల‌లో చాలా బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను ఎందుకు పోటీ పెడుతున్నారో ? ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఎచ్చెర్ల సీటు బీజేపీలో ఎవ‌రికి ఎందుకు ఇచ్చారో అర్థం కావ‌ట్లేదు. ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి సీటు సైతం ముక్కు మొకం తెలియ‌ని వ్య‌క్తికి బీజేపీ ఇవ్వ‌డం వెన‌క కుట్ర దాగి ఉందా ? అన్న సందేహాలు త‌లెత్తుతున్నాయి.

పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీ నుంచి శివ‌రామ‌కృష్ణంరాజు అనే వ్య‌క్తికి ఇచ్చారు. నియోజ‌క‌వ‌ర్గం అంతా భూత‌ద్దం పెట్టి వెతికినా కూడా ఎవ్వ‌రికి తెలియ‌ని.. ప‌రిచ‌యం లేని వ్య‌క్తికి సీటు ఇవ్వ‌డంతో అంద‌రూ కంగుతింటున్నారు. అస‌లు ఏ మాత్రం గెలిచే అవ‌కాశం లేని వ్య‌క్తికి ఎలా ?  సీటు ఇస్తారంటూ ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక్క‌డ నుంచి ముందుగా టీడీపీ - జ‌న‌సేన కూట‌మిలో భాగంగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే న‌ల్ల‌మిల్లి రామ‌కృష్ణా రెడ్డి కి సీటు కేటాయించారు.

ఇప్పుడు ఆయ‌న్ను త‌ప్పించేసి బీజేపీ నుంచి శివ‌రామ‌కృష్నం రాజు అనే వ్య‌క్తికి ఇచ్చారు. అస‌లు ఆయ‌న ఎవ‌రో నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎవ్వ‌రికి తెలియ‌దు. ఈ మార్పును టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఈ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే రాజ‌మండ్రి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తోన్న కేంద్ర మాజీ మంత్రి , ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి ఏకంగా 70 వేల ఓట్ల మైన‌స్ వ‌స్తుంద‌ని.. కావాల‌నే పురందేశ్వ‌రిని ఓడించే క్ర‌మంలో ఎవ‌రో కుట్ర ప‌న్ని అన‌ప‌ర్తి లో బీజేపీ త‌ర‌పున వీక్ క్యాండెట్‌ను నిల‌బెట్టేలా చేశార‌ని స‌రికొత్త అనుమానాలు త‌లెత్తుతున్నాయి.

కొంద‌రు అయితే బీజేపీ - వైసీపీ నేత‌ల్లో కొంద‌రి మ‌ధ్య న‌డిచి న తెర‌వెన‌క గేమ్ వ‌ల్లే అన‌ప‌ర్తి సీటు బీజేపీ తీసుకుని.. పైగా అక్క‌డ ఎవ్వ‌రికి తెలియ‌ని క్యాండెట్‌ను పోటీకి పెట్టార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: