ఏపీలో రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. గడిచిన దశాబ్ధ కాలంలో ఎప్పుడు చూడని కనిపించని అంశాలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. జగనన్న విడిచిన బాణాన్ని అంటూ కొన్నేళ్ల క్రితం వేలాది మంది ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన షర్మిళ.. ఇప్పుడు అదే జగన్ పై నిప్పులు కురిపిస్తున్నారు. ఏపీ పీసీసీ రథసారథిగా వ్యవహరిస్తున్నారు.


ప్రస్తుతం ఆమె చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇంత కాలం జగన్ ని ఉద్దేశించి ఎవరూ అనని మాటల్ని షర్మిళ అనడం హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఆమె న్యాయ్ పేరిట బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమెను నేరుగా విమర్శించని వైసీపీ అండ్ కో.. దాని అనుబంధ పత్రికలు ఇక నేరుగా విమర్శలు గుప్పించడం మొదలు పెట్టాయి. వైసీపీ సీనియన్ నేతల దగ్గర నుంచి.. దాని అనుకూల మీడియా వరకు షర్మిళను లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నారు.


ఈ మేరకు పలు కథనాలను సైతం ప్రచురిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు.  తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్న షర్మిళ అనూహ్యంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. ఆ తర్వాత ఆమెను పట్టుబట్టి మరీ చంద్రబాబు శిష్యుడు, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లేలా చేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే. శివకుమార్ వద్ద ఈ విషయమై పంచాయితీ కూడా జరిగింది.


ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించి.. జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయిస్తున్నారు. షర్మిళ రాజకీయాల్లోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె వెనుక ఎవరు ఉన్నారు అనేది. మరోవైపు షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కాబట్టి ఆ ఓట్లను కొంత వరకు చీల్చగలిగితే.. తమకు లాభిస్తుందని చంద్రబాబు అంచనా వేశారు. మొత్తం మీద చంద్రబాబు పావుగా షర్మిళ మారి తన అన్నను విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: