తెలంగాణ కాంగ్రెస్ లో కొనసాగుతున్న కీలక నేతల్లో విహెచ్ కూడా ఒకరు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది తక్కువే. కానీ ఇక ఏదో ఒక నామినేటెడ్ పదవుల్లో మాత్రం కొనసాగుతూనే ఉంటారు ఆయన. ఇక ఈయనను అపర కాంగ్రెస్ వాది అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది అపర అసంతృప్తి వాది అని కూడా అంటారు. ఎందుకంటే ఏకంగా కాంగ్రెస్లో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం అయిన వ్యక్తినే విమర్శించడం చేస్తూ ఉంటారు వి హనుమంతరావు. గతంలో వైయస్సార్ హాయంలో ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా ఇదే వ్యవహార శైలిని కనబరుస్తున్నారు.


 గత కొంతకాలం నుంచి తనకు ఒక ఎంపీ కావాలి అంటూ వి. హనుమంతరావు పలు కార్యక్రమాలలో ఇచ్చిన ప్రసంగాలలో చెప్పకనే చెప్పారు. కానీ ఇక కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గెలుపు గుర్రాలను బలిలోకి దింపాలి అనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి విహనుమంతరావును పక్కన పెట్టేసింది. దీంతో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే విమర్శలు చేయడమే కాదు.. ఇక కాంగ్రెస్ పార్టీని సైతం టార్గెట్ చేస్తూ ఇటీవల విహెచ్ చేసిన విమర్శలు కాస్త తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.


 ఏకంగా సొంత పార్టీకే శాపనార్థాలు పెట్టారు వి హనుమంతరావు. దేశవ్యాప్తంగా మోడీ గాలివీస్తుంది. ఎవరిని అడిగిన మోడీ అని అంటున్నారని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న కాంగ్రెస్ గాలి ఇప్పుడు లేదు అంటూ విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు. 16 స్థానాల్లో కూడా కాంగ్రెస్పార్లమెంట్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపింది. ముఖ్యంగా వలస వచ్చిన నాయకులకు ఇలా ఎక్కువగా టికెట్లను కేటాయించారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారిపోయింది. పదేళ్లు కేసీఆర్ తో ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్లకే టికెట్లు ఇవ్వడం కారణంగా కాంగ్రెస్ కి ఇమేజ్ డామేజ్ అయిందంటూ వి హనుమంతరావు చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాలలో సంచలనగా మారిపోయాయి. టికెట్ ఇవ్వకపోవడంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: