ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి ఎన్నికలు ఒక గొప్ప చారిత్రాత్మక తీర్పును ఇవ్వబోతున్నాయి.ఎప్పుడు లేనంతగా ఈసారి యువత ఓటు వేయడానికి ముందుకు వచ్చారు..ఎప్పుడు లేనంతగా వృద్దులు, మహిళలు, వికలాంగులు గంటల తరబడి క్యూ లైన్ లలో నుంచుని ఓటు వేశారు. కొన్ని చోట్ల అయితే అర్ధరాత్రి రెండు అయినా కూడా పోలింగ్ క్యూ లైన్లలో ఓటర్లు పడిగాపులు కాస్తున్నారు.ఒక పక్క రాష్ట్రంలో కొన్ని చోట్ల తీవ్ర గొడవలు అధికార ప్రతి పక్ష పార్టీలు ఒకరి పై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటున్నారు. మరో వైపు కొంతమంది దుండగులు పోలింగ్ కేంద్రంలో దూరి ఈవిఎం మిషన్లను ధ్వంసం చేసారు.. కొన్ని చోట్ల ఇలాంటి హింసాత్మాక ఘటనలు జరిగాయి మిగిలిన చోట పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గొడవలు జరిగిన పోలింగ్ బూత్ లలో మళ్ళీ పోలింగ్ జరిపారు. ఆ గొడవలు ఏమి పట్టించుకోకుండా ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి దైర్యంగా ఓటు వేశారు. ఈ సారి ప్రజలు ఉత్సాహంగా వచ్చి ఓటు వేయడంతో ఈ సారి పోలింగ్ శాతం కూడా పెరిగింది..ఇలా ఎన్నికలు కొన్ని చెదురుముదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది..మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరి వైపు నిలిచారు..?ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రస్తుతం చాలా మంది ఎదురు చూస్తున్నారు..

రాష్ట్రంలో గత ఐదేళ్లు జరిగిన సంక్షేమం, అభివృద్ధి చూసి వైసీపీ నేత జగన్ ఓటు వేయమన్నారు.. తాను ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చాను.. ఈ సారి వస్తే మరింత మంచి చేస్తాను మరింతగా సంక్షేమం అందిస్తాను.అని జగన్ హామీ ఇచ్చారు.. అలాగే ప్రతి పక్ష నేత చంద్రబాబు.. జగన్ కు ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడమే తెలీదని ఎద్దేవా చేసారు.. రాజధానిని అతిగతి లేకుండా చేసారు.. ప్రభుత్వ ఖజానా సంక్షేమ పధకాలకే వాడుతున్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించ బడటం లేదు.. ఉద్యోగులకు కూడా సరైన సమయంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీని తీవ్రంగా విమర్శించారు. కానీ కూటమి మేనిఫెస్టో చుస్తే ఈ సారి కూటమి కూడా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆ మేనిఫెస్టోలో వున్న హామీలు చుస్తే మన స్టేట్ బడ్జెట్ సరిపోదేమో అనిపిస్తుంది. అంతలా హామీల జోరు చూపించారు.రాష్ట్రంలో ఇప్పుడు అంత సంక్షేమం తప్ప అభివృద్ధికి ఆస్కారం లేదు. అధికార పార్టీ  తాము మెడికల్ కాలేజెస్ కట్టించాము, పోర్టులు నిర్మించాము, వైద్య సహాయాన్ని మెరుగు పరిచాము, పేద రైతుల కొరకు రైతు భరోసా కేంద్రాలు నిర్మించాము..అని ఎన్నికల ప్రచారంలో తెలిపింది.. తాము అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు ఈసారి మరింత అభివృద్ధి చేస్తాము అని వైసీపీ తెలిపింది.. కానీ ఉచిత హామీలు ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అక్కడే ఉంటుంది ముందుకు రాదు.మరి ఈ సారి పోలింగ్ శాతం పెరగడంతో ప్రజలు ఎటు వైపు మొగ్గు చూపారో తెలియాల్సి వుంది.మేనిఫెస్టో మొత్తం ఉచిత హామీలు పెట్టిన చంద్రబాబు వైపా , లేక సంక్షేమం తో పాటు అభివృద్ధి చేస్తాను అని హామీ ఇచ్చిన జగన్ వైపు వున్నారో తెలియాల్సి వుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: