అయితే ఇంట్లో పోరు పడలేక పేర్ని నాని పోటి నుంచి తప్పుకుని.. తన తనయుడు పేరును కిట్టూకి సీటు ఇప్పించుకోక తప్ప లేదన్న గుసగుసలు కూడా మచిలీపట్నంలో గట్టిగా నడిచాయి. ఈ ఎన్నికల్లో ఎంతో అట్టహాసంగా తన కుమారుడు కిట్టూని పొలిటికల్ ఎంట్రీ చేయించి పోటీ చేయించినా.. మంత్రి కొల్లు రవీంద్ర చేతులో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. తొలి ఎన్నికల్లోనే కిట్టు ఓడిపోవడంతో.. పేర్ని నాని ఫ్యామిలీ సైతం పెద్ద షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి..? పైగా తాను పొలిటికల్ కెరీర్ త్యాగం చేసి తన కుమారుడికి సీటు ఇప్పించుకున్న గెలిపించుకోలేకపోయానని అసలు వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. తెగ అవాకులు, చెవకులు పేల్చాను.. ఇప్పుడు రాజకీయంగా తన కుమారుడిని టీడీపీ, జనసేన వాళ్లు టార్గెట్ చేస్తే..? ఇలా రకరకాల టెన్షన్లతో పేర్ని నాని భయం భయంగా ఉంటున్నట్టు బందర్ పొలిటికల్ వర్గాల గుసగుస.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి