రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలతో మమేకమయ్యేందుకు, వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వారానికి ఒకరోజు అందుబాటులో ఉంటున్నారు. ప్రజా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి, దానిని చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు మంగళగిరి కార్యాలయానికి తరలివచ్చి సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.
బాబు చాలా మందితో సంభాషిస్తూ, వారి బాధలను ఓపికగా విన్నారు. విరామం తీసుకోకుండా మూడు గంటలకు పైగా సమయాన్ని కేటాయించి, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపారు. వృద్ధులు, వికలాంగులను వ్యక్తిగతంగా సంప్రదించి, వారి సమస్యలను పరిశీలించి, సత్వర ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు మూడు గంటలకు పైగా నిల్చునే ఉన్నారు. ఒక్క నిమిషం కూడా ఆయన కుర్చీలో కూర్చోవడము లేదంటే రెస్ట్ తీసుకోవడమో చేయలేదు.
బాబులో ఉన్న ఇంత స్టామినాను చూసి ఆఫీసు సిబ్బంది ఆశ్చర్యపోయారు. 74 ఏళ్ళ వయసులో గంట నిల్చోడమే గగనం. ఇక ఓపికగా అందరినీమాట్లాడటం మరింత కష్టం. కానీ చంద్రబాబు మాత్రం వయసు అయిపోయినా కుర్రాళ్లకు పోటీగా ఫిజికల్ స్టామినా చూపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయనకు ప్రజాదరణ ఎప్పటికీ తగ్గదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ బాబు తన గొప్ప స్టామినాను చూపించారు, విరామం లేకుండా రాష్ట్రమంతా పర్యటించాడు. గంటల తరబడి నిలబడి సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.