ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోంది. అధికారంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు మంత్రివర్గంలో మూడు బెర్తులు దక్కాయి. అందులో పవన్ కళ్యాణ్ ఏరికోరి తీసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరాఫరా, అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖలపైనే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే స్థాయిలో తన శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఆ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్ ను ప్రక్షాళనగా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. పంచాయతీలో సర్పంచ్ వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్ రెండు నెలల వ్యవధిలో ముడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.



గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే, స్వాతంత్ర, గణతంత్ర వేడుకల నిర్వహణకు, పంచాయతీలకు నిధులు వంటి కీలక నిర్ణయాలను ఫైనల్ చేశారు పవన్ కళ్యాణ్. అయితే పంచాయతీలపై పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయడానికి కారణం ఏంటి అనే నిర్ణయంపై రాజకీయాల్లో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును లికించుకుంది.


జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో మూడు స్థానాలలో మంచి మెజారిటీతో గెలిచింది. అలాగని రాష్ట్రమంతా పెద్ద పట్టున్న పార్టీ ఏమీ కాదు. కాకపోతే ప్రభావం మాత్రం చూపగలదని తాజా ఎన్నికల్లో తేలిపోయింది. టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీల్లో క్షేత్రస్థాయిలో జనసేన వెళ్లాలను కోలేదు. అందుకు అవసరమైన కమిటీలు కానీ, బూత్ లెవెల్ కార్యకర్తలు గానీ జనసేనకి లేరు. అందుకే ఆ దిశగా పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆ విధంగానే పంచాయతీరాజ్ మీద కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. పంచాయతీలపై ఫోకస్‌ చేసి.. జనసేన పార్టీని టీడీపీ కంటే బలంగా కింది స్థాయిలో ఉండేలా పవన్‌ అడుగులు వేస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: