ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తారని... గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కొత్త ప్రభాకర్ రెడ్డి... రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గులాబీ పార్టీ కంటే... ప్రజలే కూలగొట్టాలని అనుకుంటున్నారని... దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వ్యాపారస్తులు అలాగే రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వారందరూ తమ వద్దకు వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చమని అడుగుతున్నారని బాంబు పెల్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి.

 అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కూడా స్పందించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం అంటూ మద్దతు తెలిపారు  కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం తాము చేయబోమని వివరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే ఆలోచన కూడా తమకు... లేదని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ తమతో చర్చించారని కూడా గుర్తు చేశారు.

 ఐదు సంవత్సరాలపాటు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగాలని.. అప్పుడే గులాబీ పార్టీకి మంచి ప్లస్ అవుతుందని కూడా అంచనా వేశారు కేటీఆర్. అయితే తెలంగాణ ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కలిసి తమ వద్దకు వస్తున్నారని కూడా వెల్లడించారు కేటీఆర్. చందాలు వేసుకొని మరి ఎమ్మెల్యేలను కొంటామని... తమ సహాయాన్ని వాళ్ళు అడుగుతున్నట్లు కేటీఆర్ వివరించారు. ఇదే విషయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లు వెల్లడించారు కల్వకుంట్ల తారక రామారావు.

 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో.. తాము చెప్పిందే నిజమైందని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్కడ భూములు ఎవరు కొనుగోలు చేసిన నష్టపోతారని హెచ్చరించారు. వచ్చేది గులాబీ పార్టీ సర్కార్ అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి పగటి కలలు మానుకోవాలని చురకలంబించారు. గులాబీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: