జమ్మూ కాశ్మీర్లో పహాల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా హై అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి హామీ ఇచ్చా కూడా పలు రకాల సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలలో ఉండే పాకిస్తానీయులను కూడా తిరిగి వారి దేశానికి పంపించేలా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో కూడా నిఘ మరింత పగడ్బందీగా చేస్తున్నారు. ఈ మేరకు తిరుమలలో కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించడం జరిగింది.


తిరుమలలో క్యాబ్ నడుపుతున్న డ్రైవర్లకు, ఓనర్లకు సైతం టీటీడీ దేవస్థానంతో పాటుగా సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు కూడా ఈ సమావేశంలో భక్తుల భద్రత కోసం నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలియజేశారు. ఈ మేరకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలి అంటూ క్యాప్ డ్రైవర్లను ఓనర్లకు సూచించారు. ఎవరైనా కూడా నిషేధిత వస్తువులను తిరుమలలో తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. అలాంటి వాటిని ఎవరైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిస్తే సమాచారం ఇవ్వాలని తెలియజేశారు


వీటికి తోడు దొంగలు కానీ ,నేరస్తులు కానీ ఎవరైనా తమ వాహనాలలో ఎక్కినట్లుగా క్యాబ్ డ్రైవర్లను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.. లేకపోతే 112 కి కాల్ చేయాలని హర్షవర్ధన్ తెలియజేశారు. ముఖ్యంగా తిరుమల లో క్యాబ్స్,వాహనాలు నడిపే డ్రైవర్లకు కచ్చితంగా లైసెన్సు ఉండాలని ఎవరైనా తిరుమలలోని నిబంధనలను ఉల్లంఘిస్తే కచ్చితంగా చర్యలు తప్పవని జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. తిరుపతిలోని అన్ని రోడ్లలో, జంక్షన్లో కూడా బాంబు డాగ్స్ వాడటానికి లు కూడా చేస్తున్నారట. అలాగే లాడ్జిలు, కొన్ని భవనాలను కూడా  తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తిరుమల లో మరింత బలగాలను తీసుకువచ్చినట్టుగా తెలుస్తోంది తిరుమలలో సిసి కెమెరాలు పనితీరు పైన కూడా ప్రత్యేకమైన దృష్టిని పెట్టారట

మరింత సమాచారం తెలుసుకోండి: