
2021 2022 నుంచి మన దేశంలోని కార్మిక మార్కెట్ డైనమిక్స్ లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. ఇందులో భాగంగా నాటి నుంచి పని చేసే జనాభా కంటే వేగంగా ఉద్యోగాల సృష్టి జరుగుతోందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. అయితే శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వృద్ధి చెందుతున్నట్టు నివేదించడం గమనార్హం.
గత మూడు సంవత్సరాలుగా దేశంలో పని చేసే జనాభా కంటే ఉపాధి వృద్ధి స్థిరంగా ఉందని వెల్లడించింది. పట్టణాలలో నిరుద్యోగ స్థాయిలు తగ్గుతున్నాయని నివేదిక పేర్కొంది. 2017 - 2018 ఆర్థిక సంవత్సరం తర్వాత పట్టణ నిరుద్యోగం తగ్గుతూ వచ్చిందని ఈ సంస్థ వెల్లడించడం గమనార్హం. ఈ సంస్థ శాతం 6.6 శాతంగా ఉండటం గమనార్హం.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు వలసలు రావడం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వ్యవసాయ వృత్తిలోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించింది. మహిళల్లో ఉద్యోగ రేటు పెరుగుతున్నా వేతనాల్లో లింగ అసమానతలు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. అయితే అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికీ పేద రాష్ట్రాలుగా ఉన్నాయని భోగట్టా. మన దేశం రాబోయే రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి చెందాలని కూడా మన దేశ ప్రజలు కోరుకుంటున్నారు. విభిన్న రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తే ప్రజలు కోరుకున్న అభివృద్ధి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.