అభివృద్ధిలో చాలా వెనుకబడిన దేశంగా  పాకిస్థాన్ ఉన్నది.. ప్రస్తుతం అక్కడ మూడు పూటల ప్రజల కడుపు నిండా భోజనం తినే ఆహారం కూడా దొరకడం కష్టమనే పరిస్థితులలో ఉన్నది. అయినా కూడా ఇలాంటి పరిస్థితులలో అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది పాక్. కానీ అభివృద్ధి పైన ఎలాంటి దృష్టి పెట్టకుండా యుద్ధానికి సిద్ధమంటూ కేవలం తెలియజేస్తూ పాక్ దేశం. అయితే ప్రస్తుతం అక్కడున్న పరిస్థితులు చూస్తే యుద్ధం ఎలా చేస్తారు అనే ప్రశ్న మొదలవుతుంది. అందుకు నిదర్శనంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.



సాధారణంగా రోడ్డుపై నుండి రైలు పట్టాలు వేస్తే ఖచ్చితంగా అక్కడ రైల్వే గేటు అనేది ఏర్పాటు అన్ని ప్రాంతాలలో చేస్తూ ఉంటారు.. ముఖ్యంగా రైలు వచ్చేటప్పుడు గేట్ మెన్ దానిని వేసి రైలు వెళ్లిపోయిన తర్వాతే ఇతర వాహనాలను పంపించేలా చూస్తూ ఉంటారు. కానీ పాకిస్థాన్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. తాజాగా పాకిస్థాన్ రైళ్ల పరిస్థితి చూస్తే.. రైలు వస్తున్నప్పుడు ఇద్దరు అటు ఇటు పరుగులు తీస్తే ఒకరు రెడ్ మరొకరు గ్రీన్ జెండాలని పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. దీంతో వాహనాలను నిలపమని కోరుతూ ఉన్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.


కానీ రైలు దగ్గరగా వస్తున్నప్పటికీ కూడా వాహనాలు మాత్రం అలాగే వెళ్ళిపోతున్నాయి. వీటిని ఆపేందుకు కూడా జెండాలు పట్టుకొని ఉన్న రైల్వే సిబ్బంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే పాకిస్థాన్లో రైళ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే వీరు రక్షణ వ్యవస్థ ఇక నేవీ, ఆర్మీ వంటివి ఎలా ఉంటాయో అంటూ పలువురి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీళ్ళు యుద్ధంలో ఎలా పాల్గొంటారు అంటూ ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ ఉన్నారు మరి కొంతమంది మాత్రం యుద్ధం కోసం కాకుండా అభివృద్ధి వైపుగా పాకిస్తాన్ అడుగులు వేయాలని సలహారిస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: