ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయుల బదిలీకి సైతం రంగం సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇకపై ప్రతి ఏటా కూడా ఉపాధ్యాయుల బదిలీ ఉంటుందంటూ మంత్రి నారా లోకేష్ కూడా తెలియజేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ప్రక్రియ కూడా చేపడతామంటూ తెలియజేశారు. ఇందుకు  సంబంధించిన తేదీలను కూడా తాజాగా ఖరారు చేసినట్లుగా విశ్వనీయ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా బదిలీలు ఎలా జరుగుతాయని విషయం పైన పలు రకాల వివరాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.



మే 7వ తేదీ నుంచి ఉపాధ్యాయ బదిలీలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మే 15 వరకు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందట. మే 18 నుంచి 20వ తేదీ వరకు ఎంఈఓల లాగిన్ లో కూడా సవరణలు చేసుకునే అవకాశం ఉంటుందట. ఆ తర్వాత మే 21 నుంచి 22వ తేదీ వరకు డీఈవో లాగిన్ లో సవరణ చేసుకుని అవకాశం ఉంటుంది.. అనంతరం మే 29వ తేదీన ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీల విషయంలో మెసేజ్లను కూడా పంపిస్తారట. వీటి ఆధారంగానే ఉపాధ్యాయులు బదిలీ కావాల్సి ఉంటుందని సమాచారం.


రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకోవచ్చారు. ఈ చట్టం ప్రకారం బదిలీలు చేయబోతున్నారు. ఆదర్శ ప్రాథమిక పాఠశాల విధానాన్ని అనుగుణంగానే ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేయబోతున్నారు. రాష్ట్రంలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు గురు ఉపాధ్యాయులు చొప్పున కేటాయిస్తారట. ఇప్పటికే అందుకు సంబంధించి విధానాలు పూర్తి అయ్యాయని రాష్ట్రంలో 7500కు పైగా ఆదర్శ పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. అలాగే వార్డు గ్రామపంచాయతీలలో ఒక బడిని ఏర్పాటు చేసేలా ప్రణాళికలను ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: