గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించిన వరంగల్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు 7 నుంచి 8 లక్షల మంది... వరంగల్ సభకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. వరంగల్ సభ నేపథ్యంలో.. దాదాపు గంట పాటు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. స్పీచ్ కొనసాగింది. ఈ సందర్భంగా... తెలంగాణ రాక ముందు అలాగే గులాబీ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి విషయాలను పంచుకుంటూనే... రేవంత్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను, ఆగమవుతున్న తెలంగాణ పరిస్థితులను వివరించారు.

 అయితే గంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగంలో ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు మాత్రం పలకలేదు. సీఎం రేవంత్ రెడ్డి పేరు లేకుండానే స్పీచ్ ముగించారు కేసీఆర్. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ ప్రతిసారి మాట్లాడారు కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు... ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి ఇక్కడ రచ్చ చేశారని మండిపడ్డారు. అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగగొట్టారని ఫైర్ అయ్యారు కేసీఆర్.


 బంగారం లాంటి తెలంగాణను నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టబోమని.. మీరు సక్కగా పనిచేయకపోతే ప్రజలే మీ వీపులు సాప్ చేస్తారంటూ ఫైర్ అయ్యారు. గులాబీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ చాలా బాగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. పోలీసులు తెలంగాణలో రెచ్చిపోయి పని చేస్తున్నారని... వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు.

 గులాబీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ పై కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు డైరీలలో రాసుకోవాలని... సూచించారు కేసీఆర్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చాడని గుర్తు చేశారు. ఆ పథకం బాగుందని 10 సంవత్సరాల పాటు తాము కూడా పేరు మార్చకుండా కొనసాగించినట్లు వెల్లడించారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కెసిఆర్ అన్నవారు లేకుండా చేద్దామని కుట్రలు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: