ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా... ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అమరావతి పునః ప్రారంభానికి కంటే ముందు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి వేదికగా పాకిస్తాన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. ఒకటి కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా కూడా ఇండియాను ఏం పీక లేదని... బాంబు పేల్చారు నారా లోకేష్.


 పాకిస్తాన్ కు సరైన సమాధానం చెప్పే అసలైన మిస్సైల్ నరేంద్ర మోడీ అని.. పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ సింహం అంటూ... ఆయన ముందు అస్సలు ఆటలు ఆడకూడదని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. నరేంద్ర మోడీ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మతిరగడం ఖాయమని హెచ్చరించారు. నారా చంద్రబాబుపై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని కుట్రలు చేశారని వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. మూడు రాజధానులు అంటూ 5 ఏళ్లుగా గడిపేసారని జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డారు.

 జై అమరావతి అన్నందుకు సంకెళ్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. మహిళ రైతులను బూటు కాళ్లతో తన్నారని మండిపడ్డారు. ఎన్ని అరాచకాలు చేసిన అమరావతి రైతులు తగ్గలే అంటూ.. నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజా రాజధాని అమరావతిని ఆపలేకపోయారని స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాజధాని అమరావతి ముందుకు దూసుకు వెళ్తుంది అని చెప్పుకొచ్చారు. దీన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని వివరించారు నారా లోకేష్.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: