అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రాజధాని అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రావడం జరిగింది. ఈ సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు కూటమి సభ్యులు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడీ సభ జరుగుతున్న... తరుణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అమరావతి మోడీ సభకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

 మందలంలో ఉన్న పొలాలలో పైపులకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మోడీ సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో... వెంటనే అలర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. అటు అగ్నిమాపక సిబ్బంది కూడా... ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడు కిలోమీటర్ల దూరంలోనే భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో... మోడీ సభ దగ్గర భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

 ఇది ఇలా ఉండగా... కాసేపటి క్రితమే ఏపీకి వచ్చిన నరేంద్ర మోడీ... అమరావతి పైలాన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పైలాన్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించడం జరిగింది. అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం A  పైలాన్ ను రూపొందించారు. వేదిక మీదకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ స్థలంలో కేరింతలతో ప్రజలు స్వాగతం పలికారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు సన్మానించడం జరిగింది. అనంతరం కలంకారి చిత్రాన్ని కూడా అందజేశారు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: