రాజకీయాలలో గెలుపు ఓటములు అనేవి కూడా సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఎలాంటి పార్టీలతో సంబంధం లేకుండా గెలిచినవారు కూడా ఉన్నారు. ఆ గెలిచిన తర్వాత ఇతర పార్టీ పార్టీలోకి వెళ్లి తమ హవా కొనసాగించిన వారు ఉన్నారు. అలాంటి వారిలో మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కూడా ఒకరు.. అయితే తాజాగా ఈయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ మరణించినట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గురించి పూర్తి వివరాలు చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే గత కొద్దిరోజులుగా ఈ టిడిపి మాజీ ఎమ్మెల్యే అనారోగ్య సమస్యతో బాధపడుతూ బెంగళూరులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారట. ఈ మాజీ ఎమ్మెల్యే వయసు ప్రస్తుతం 78 సంవత్సరాలు. గడిచిన కొన్ని గంటల క్రితం చికిత్స పొందుతూ ఈయన తుది శ్వాస విడిచినట్లు  తెలుస్తోంది. 1978లో  రాయచోటి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు సుగవాసి పాలకొండ్రాయుడు.. ఆ తర్వాత మళ్లీ 1983లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి మంచి విజయాన్ని అందుకున్నారట. మళ్లీ 1984లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మరి గెలిచారు. అనంతరం 1999, 2004లో కూడా రాయచోటి నుంచి టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకున్నారట. అయితే ఈ విషయం విన్న అటు సీనియర్ నేతల తో పాటు టిడిపి కార్యకర్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి  గురవుతున్నారు.


ఇక రాయుడు కడప జిల్లాలోని రాయచోటి గ్రామంలోనే జన్మించారు.. అక్కడే తన విద్యాభ్యాసాన్ని కూడా పూర్తి చేశారట. 1968లో సుగవాసి పాలకొండ్రాయుడు వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. మరి టిడిపి నేత మరణ వార్తతో అటు టిడిపి క్యాడర్ ఏ విధంగా  స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: