పహల్గాం ఉగ్రదాడి ఘటన ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారు. అయితే యుద్ధానికి ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే దిశగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోందని సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు తాజాగా ఆదేశాలు ఇచ్చిందని తెలుస్తోంది.
 
ఈ నెల 7వ తేదీన అన్ని రాష్ట్రాల హోం శాఖలు తమ ప్రాంతాల్లో ఉన్న పోలీసులతో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచనలు చేసినట్టు సమాచారం అందుతోంది. ఊహించని ఘటనలు జరిగిన సమయంలో ప్రజలు అప్రమత్తంగా సమయస్పూర్తితో ఏ విధంగా వ్యవహరించాలో తెలియజేయాలనే మంచి ఆలోచనతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది.
 
దేశవ్యాప్తంగా ఈ విధంగా చేయాలని కీలకమైన ఆదేశాలు ఇవ్వడం సంచలనం అవుతోంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకు వైమానిక దాడుల గురించి అవగాహన వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. యుద్ధం జరిగే పరిస్థితి వచ్చినా ప్రజలకు అపాయం కలగకుండా మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. మోదీ సర్కార్ భవిష్యత్తు ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
 
పాకిస్తాన్ ను ఆర్థికంగా సైతం దెబ్బ కొట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మోదీ సర్కార్ మన దేశానికి అన్యాయం జరగకుండా ప్రజలకు న్యాయం జరగాలని భావిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: