14 ఏళ్ల క్రితం ఓబులాపురం గనుల కేసు ఒక సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి తీర్పు వెళ్ళబడలేదు. తాజాగా ఈ రోజున ఈ కేసుకు సంబంధించి తీర్పుని ప్రత్యేక కోర్టు తెలియజేసింది. ఇందులో ఐదు మంది దోషులుగా కోర్టు తేల్చింది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తో పాటు, బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి పిఏ మోర్పోజ్ అలీఖాన్ , ఓఎంసీ కంపెనీ దోషులతో పాటుగా వీడి రాజగోపాల్ ను కూడా సిబిఐ కోర్టు దోషులుగా తెలియజేసింది.

అయితే ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందాన సైతం కోర్టు నిర్దోషిగా తెలియజేయడం జరిగింది. ఓబులాపురం మైనింగ్ కేసు కు సంబంధించి తుది తీర్పుని తెలియజేసింది. ఓబులాపురం మైనింగ్ తవ్వకాలను అక్రమాలు జరిగాయని 2009లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సిబిఐ దర్యాప్తును కూడా చేపట్టింది. అలా 2009 డిసెంబర్ 7న సిబిఐ కేసు నమోదు చేశారు. 2011లో ఓఎంసీ కేసులో మొదటి చార్జి సీట్లు కూడా దాఖలయ్యాయట.


అందులో 9 మంది పేర్లు నిందితులుగా చేర్చారు. వారిలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, అలాగే గాలి జనార్దన్ రెడ్డి, మోఫాజ్ అలీ ఖాన్, మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు మరికొంతమంది నిందితులుగా చేర్చారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఈ రోజున మైనింగ్ కేసులు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పుని సైతం తెలియజేసింది. ఇందులో సిబిఐ చేర్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మికి 2022 లోను ఊరట కలిగించింది. అయితే కొన్ని నెలల పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలు జీవితాన్ని కూడా గడిపారట. అయితే ఈ కేసులో ఈమె పైన సరైన ఆధారాలు లేకపోవడంతో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు కవిత ఇంద్ర రెడ్డి కూడా నిర్దోషిగా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: