పహల్ గామ్ లో జరిగిన ఉగ్ర దాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో దేశం లోని పౌరులంతా పాకిస్థాన్ పై మండిపడుతున్నారు. దెబ్బకు దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా యుద్ధం ప్రకటించేందుకు సన్నహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాంటి ఈ తరుణంలో  ఉగ్ర దాడి గురించి  కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్  మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ లోని రాంచీలో  సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.. ఉగ్ర దాడి గురించి మోడీకి మూడు రోజుల ముందే తెలుసు అన్నారు. 

ఈ విషయాన్ని నేను ఏదో పేపర్ లో చదివానని తెలియజేశారు. మూడు రోజుల ముందే ఇంటిలిజెన్స్ వర్గాలు పహల్ గామ్ లో అటాక్ జరుగుతుందని  హెచ్చరించారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే నరేంద్ర మోడీ తన కాశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇదంతా తెలిసినా కానీ మోడీ భద్రత ను ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోయారని ప్రశ్నించారు. మోడీ ప్రజలను, భద్రత సిబ్బందిని అలర్ట్ చేయకపోవడం వల్లే పహెల్ గామ్ లో అటాక్ జరిగిందని ఇదంతా మోడీ వైఫల్యమే అని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు.

 అంతేకాకుండా పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం  ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుందని మల్లికార్జున ఖర్గే  తెలియజేశారు. ఈ విధంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడడంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. మరి ఇందులో నిజమెంతో అబద్ధమేంటో తెలియదు కానీ, మల్లికార్జున ఖర్గే మాటలపై కొంతమంది సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ  ఆ దాడి లో మాత్రం అమాయక ప్రజలే మరణించారని చెప్పవచ్చు. తప్పనిసరిగా పాకిస్తాన్ పై దాడి చేసి దెబ్బకు దెబ్బతీస్తేనే ప్రజలు కూడా ఆనందపడతారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: