భారతదేశం ఎన్నో విషయాలలో ఇతర దేశాలకు స్పూర్తిగా నిలిచే దేశం అనే సంగతి తెలిసిందే. మన దేశ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులకు పాల్పడుతున్నా మన దేశ సైన్యం మాత్రం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసే దిశగా అడుగులు వేస్తుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. మన దేశ సైన్యం ప్రిసిషన్ గైడెడ్ మిసైళ్లను ఇందుకోసం వినియోగించింది.
 
పాకిస్తాన్ సైనిక స్థావరాలపై కానీ, పాక్ పౌరులు నివశించే ప్రాంతాలలో కానీ దాడులు నిర్వహించలేదని భారత సైన్యం చెబుతుండటం కొసమెరుపు. ఈ విధంగా చేయడం మన దేశం ప్రదర్శించిన గొప్ప సంయమనం అని చెప్పవచ్చు. కోట్లీ, గంభేర్, చట్రం ప్రాంతాలలో ఉన్న ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడులు చేసింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలకు భారత సైన్యం చుక్కలు చూపించింది.
 
మొత్తం 30 మంది ఉగ్రవాదులు ఈ దాడిలో మృతి చెందినట్టు తెలుస్తోంది. భారత్ ప్రతీకార దాడులకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అటు పాకిస్తాన్ లో ఇటు భారత్ లో కొన్ని ప్రధాన ఎయిర్ పోర్టులు మూసేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ పరిస్థితి కొనసాగుతోందని సమాచారం అందుతోంది. భారత వైమానిక దళం సైతం సన్నద్ధంగా ఉందని భారత సైన్యం ప్రకటించింది.
 
కేవలం ఉగ్రవాదం మీద పోరాటం దిశగా మన దేశ సైన్యం ప్రకటించదం కొసమెరుపు. పాక్ రెచ్చిపోతే తిప్పికొట్టే దిశగా భారత సైన్యం ఉందని సమాచారం. నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ మన దేశ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. మన దేశ సైన్యం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుందని భోగట్టా.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: