
భారత్ చేపట్టిన పాకిస్తాన్ గుండెల్లో పరుగులు పెట్టిస్తుండటం గమనార్హం. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని భారత 28వ ఆర్మీ చీఫ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అభీ పిక్చర్ బాకీ హై అంటూ ఆయన పోస్ట్ చేయడం సంచలనం అవుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోబోమని పిరికిపంద చర్యలకు పాల్పడబోమని భారత సైన్యం చెప్పకనే చెబుతున్నారు. ఈ ఘటనతో పహల్గాం ఘటనలో మృతి చెందిన వాళ్ల ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. కసబ్, హెడ్లీకి శిక్షణ ఇచ్చిన స్థావరాలు సైతం ధ్వంసం అయ్యాయని తెలుస్తోంది. దాడులు జరిగినట్టు పాకిస్థాన్ ఆర్మీ సైతం ధృవీకరించడం కొసమెరుపు.
భారత్ మిస్సైల్స్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిరసనలకు పాల్పడినట్టు తెలుస్తోంది. శాంతి చర్చలకు పాక్ సిద్ధమని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ చెప్పుకొచ్చారు. భారత్ శాంతి మార్గాన్ని ఎంచుకుంటే పొరుగు దేశాలుగా చర్చించుకుందామని ఐతే వాళ్లు నిజాలతో రావాలని ఆయన చెప్పుకొచ్చారు. బిలావల్ భుట్టో గతంలో పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు