
దినేష్ కుమార్ మృతికీ వైట్ నైట్ కార్స్ సంతాపాన్ని తెలియజేశారు.. అలాగే ఆయన కుటుంబానికి కూడా ప్రగాడ సానుభూతిని తెలియజేసింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇదే కాల్పులలో సరిహద్దుల గ్రామాలలో సైతం నివసిస్తున్నటువంటి 15 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారట. వీటికి తోడు 43 మందికి గాయాలు అయ్యారని వీరి కుటుంబాలకు కూడా ఇండియన్ ఆర్మీ మానవీయ సానుభూతిని ప్రకటించారు. ఇప్పటికే పహాల్గం ఉగ్రదాడికి ప్రతికారంగా భారత్ సైన్యం కూడా ఫాక్ ఆక్రమిత ఉగ్రవాద ప్రాంతాలలో కాశ్మీర్లో మెరుపు దాడులు కూడా చేపట్టారు.
ఈ ఉగ్రవాద స్థావరాలలో లస్కేరే తోబాయి , ఇస్బుల్ ముజాహిద్దీన్, జైసి మహమ్మద్ వంటి ఉగ్ర స్థావరాలను సైతం టార్గెట్ చేసి మరి భారత్ ఆర్మీ మిస్సైల్ దాడులు చేసింది ఈ దాడిలో ఉగ్రవాదులకు సంబంధించి కుటుంబాలు కూడా మరణించినట్లు పాక్ మీడియా అధికారికంగా తెలియజేసింది. ఈ విషయాలను జీర్ణించుకోలేకపోయినా పాకిస్తాన్ భారతదేశం పైన మరింత దాడులు చేసేలా ప్లాన్ చేసింది. అందుకే తంగాధర్ ప్రాంతాలలో తీవ్రమైన కాల్పులు చేసినట్లుగా సమాచారం. అయితే ఈ దాడులకు భారత్ సైన్యం సమర్ధంగా ఎదుర్కొన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్లో ఉండే వారంతా యుద్ధం వద్దని శాంతియుతమే కావాలని కోరుకుంటున్నారు. మరి వీటి పైన ఎవరు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.