ఆపరేషన్ సింధూర్ అంటూ భారత్ ఆర్మీ పాకిస్తాన్ కు చుక్కలు చూపించే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ వక్ర బుద్ధితో మన దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు తెగబడగా ఈ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. సెలబ్రిటీలు మన ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటం ఒకింత సంచలనం అవుతోందనే చెప్పాలి.
 
మరింత ధైర్యంగా ముందుకు సాగాలని మీ వెంట మేమున్నామంటూ సెలబ్రిటీలు పోస్ట్ లు పెడుతున్నారు. ఆర్మీకి సెల్యూట్ చేయడంతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాళ్లు సూచనలు చేస్తుండటం గమనార్హం. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ తన సోదరుడు చెప్పిన మాటలను పంచుకున్నారు. భయ్యా మనం భారతదేశంలో ఉన్నాం.. భారతీయులం.. మన రక్షణ సైన్యం, మన వైష్ణో మాత మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
 
పాకిస్తాన్ కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా మన భూమిని తాకనివ్వరు.. భారత్ మాతాకీ జై అంటూ తన సోదరుడు చెప్పారని ఆయన తెలిపారు. స్టార్ హీరో సాయితేజ్ తన పోస్ట్ లో భారత సైన్యానికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని మన రక్షణ దళాలు ధైర్యంగా సాగుతూ శత్రువుల గుండెల్లో భయాన్ని నింపాలని పేర్కొన్నారు.
 
మంచు విష్ణు తన పోస్ట్ లో దీన్ని వాళ్లు ప్రారంభించారని మనం ముగిస్తామని భారత సాయుధ దళాల కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు. శత్రు దేశం పాకిస్తాన్ జమ్మూను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోందని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. మమ్మల్ని కాపాడుతున్న మీకు కృతజ్ఞతలు అని మీరంతా జాగ్రత్తగా ఉండండి అని ఆమె కామెంట్లు చేశారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: