ఒకవైపు ఇండియన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉండగా మరొకవైపు నుంచి దాయాది పాకిస్తాన్ బాలుచిస్థాన్ స్థానంలో బిఎల్ఎ తాలిబాన్స్ పాకిస్తాన్ పైన దెబ్బ కొడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ ని కవ్విస్తూ యుద్ధం కావాలంటూ ప్రవర్తిస్తోంది పాకిస్తాన్. అయినప్పటికీ కూడా ఇప్పటికే బీఎల్ఏ పాక్ సైనికులను సైతం ఊచకోత కోస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తాజాగా పాకిస్తాన్ తాలిబాన్లు 30 మంది పాకిస్తాన్ సైనికులను చంపినట్లుగా నిన్నటి రోజున అర్ధరాత్రి తెలియజేశారు.


మార్చి నుండి పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా తాలిబాన్లు ఆపరేషన్ ఆల్ ఖండక్ నిర్వహించినటువంటి తాలిబాన్లు నిన్నటి రోజున రాత్రి దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి షైకే జిల్లాలో డాన్ గేట్ సైనిక పోస్టు పైన తీవ్రమైన దాడి చేసినట్లుగా తెలియజేశారు.ఈ దాడిలో 6 మంది పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తులని లేజర్ గన్నుతో చంపినట్లుగా టిటిపి మహమ్మద్ కరోసాని తెలియజేశారు. అయితే ఈ దాడి విషయం తెలుసుకున్న ఒక సైనిక కాన్వాన్ మాత్రం ఆ ప్రాంతం నుంచి వచ్చే సమయంలో తమ పైన దాడి చేసినట్లుగా తెలియజేశారు టిటిపి మహమ్మద్.


దీంతో ఈ ఆపరేషన్లో మొత్తం మీద 20 మంది సిబ్బంది పైన మరణించారని అలాగే 5 మందిపైగా గాయాలు అయ్యాయని తెలియజేశారు. అలాగే ఉత్తర వజిరిస్తాన్ మిరాళి ప్రాంతంలో శుక్రవారం మరొక సైనిక కాన్వాన్ పైన పాకిస్తాన్ తాలిబాన్లు మరొకసారి దాడి చేశారని ఇందులో ఎనిమిది మందికి పైగా సైనికులు మరణించారని నలుగురు గాయపడ్డారు అంటూ తాలిబాన్లు వెల్లడిస్తున్నారు. అలాగే ఇదే ప్రాంతంలో మీరు అలీ జిల్లాలో కూడా హనీమూన్ హోటల్ పైన సైనికుల చెక్పోస్ట్ పైన దాడి చేశామని ఇద్దరు ఫాక్ సైనికులు సైతం అక్కడ హతమార్చినట్లుగా టిటిపి వెల్లడించారు. మొత్తానికి తాలిబండ్ల వల్ల పాకిస్థాన్ లో సుమారుగా 30 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లుగా తెలియజేస్తున్నారు తాలిబాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: