కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులు అమాయకులై న అనేక మంది భారతీయుల ప్రాణాలను బలి తీసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకు న్న భారత ప్రభుత్వం ఆ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశం తో ఆపరేషన్ సింధూర్ ను మొదలు పెట్టింది . అందులో భాగంగా అమాయకమైన భారతీయుల ప్రాణాలను తీసిన ఉగ్ర వాదులను చంపే సంకల్పాన్ని నిర్ణయించుకుంది . అందులో భాగంగా ఒక్క సారిగా ఉగ్ర వాద స్థావరాలపై దాడి చేసి అనేక మంది ఉగ్రవాదుల ప్రాణాలను భారతీయ ఆర్మీ తీసేసింది.

ఇకపోతే ఇలా భారతీయ ఆర్మీ ఉగ్రవాదులను చంపివేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశం చేసింది తప్పు. వారు ఉగ్రవాదులు అయి ఉండవచ్చు. కానీ భారత్ చేసిన దాడి వల్ల మా దేశానికి సంబంధించిన అనేక మంది అమాయకులు కూడా ప్రాణాలను కోల్పోయారు. అందు వల్ల మేము కూడా భారత్ పై దాడి చేస్తాము అని ప్రకటించింది. చెప్పిన విధంగానే భారత్ పై దాడి చేస్తుంది. ఇకపోతే వరుసగా రెండో రోజు పాకిస్తాన్ చేసిన దాడులను భారత ఆర్మీ తిప్పి కొట్టింది. LoC వెంబడి 26 ప్రాంతాల్లో భారత ఆర్మీ పాక్ డ్రోన్ లను కూల్చివేసింది.

ముందుగా చాలా జాగ్రత్తగా సరిహద్దు పట్టణాల్లో బ్లాక్ అవుట్ చేపట్టి ప్రత్యర్థిని అత్యంత గందర గోళం లోకి నెట్టింది. మరో వైపు సరిహద్దుల్లో దాయాది దేశం జరుపుతున్న కాల్పులకి కూడా భారత ఆర్మీ అత్యంత సమర్థవంతంగా సమాధానం ఇచ్చింది  ఇకపోతే పాకిస్తాన్ లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ తాము డ్రోన్ దాడులను పాల్పడలేదు అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం పాక్ , భారత్ పై దాడులను చేస్తున్న వాటిని భారత ఆర్మీ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: