
ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా జిల్లాలో ఎంపీ బైరెడ్డి శబరి పెత్తనాన్ని సహించేది లేదని ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారు. పాణ్యం నియోజకవర్గంలో ఎంపీ శబరి చెప్పిన పనులు ఏమి చేయవద్దు అని ఎమ్మెల్యే గౌరు చరిత పట్టుబడుతున్నారు. అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాథినిత్యం వహిస్తున్న బనగానపల్లి నియోజకవర్గంలో ఎంపీ ఇచ్చిన సిఫార్సు లేఖలను పక్కన పెట్టేయడని ... వాళ్లకు సిమెంట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వవద్దంటూ మంత్రి ఇప్పటికే సీరియస్గా హుకుమ్ జారీ చేసినట్లు తెలుస్తోంది. చివరకు ఎంపీ సొంత నియోజకవర్గమైన నందికొట్కూరులోనూ ఆమె మాట చెల్లుబాటు కావడం లేదు.
పోలీసులు పోస్టింగులు ... స్టేషన్లో పంచాయతీలు ... రెవిన్యూ కార్యాలయాలలో రికమండేషన్లు ఇలా ఎక్కడికి వెళ్లిన అధికారుల నుంచి నో అనే సమాధానమే వస్తోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పెత్తనంతో ఎంపీ కేవలం ఒక్క మండలానికి పరిమితమయ్యారని చర్చ కూడా నడుస్తోంది. మరోవైపు శ్రీశైలం - డోన్ నియోజకవర్గంలోనూ ఎంపీ పెద్దగా పర్యటన పర్యటించడం లేదు. ఎవరైనా ప్రైవేట్ కార్యక్రమాలకు ఆహ్వానిస్తే ఇలా వెళ్లి అలా వచ్చేస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ లోను భూమా అఖిల ప్రియ - బైరెడ్డి శబరిమధ్య మనస్పర్ధలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీలో ఈ వర్గ విభేదాలు ఎటువైపు దారితీస్తాయో చూడాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు