టిడిపి నేతలు, టిడిపి పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొనే మహానాడు సభ ఈనెల 27 నుంచి 29 వరకు నిర్వహించబోతున్నారు. ఈ మహానాడుకు రెండు ప్రధాన ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి.. ఒకటి మొదటిసారి ప్రతిపక్ష నేత జగన్ ఇలకాలో కడపలో నిర్వహిస్తూ ఉన్నారు.. మరొకటి కూటమి విజయం దక్కించుకోవడంతో పాటు 75 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఇక నారా లోకేష్ కూడా తనని తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిణామాలు అన్ని చూస్తూ ఉంటే కూటమి మరొక ఐదు ఏళ్లపాటు బలంగా ఉంటుందని సంకేతాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.



అందుకే ఈసారి మహానాడు సభకు చాలా ప్రాధాన్యం పెరిగిందనే విధంగా వినిపిస్తున్నాయి. సుమారుగా 5 లక్షల మంది ఈ మహానాడు సభకు రాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మహానాడు ని చాలా గ్రాండ్గా సక్సెస్ చేయాలని పలు రకాల కమిటీలను కూడా వేస్తున్నారట. అయితే ఇదంతా బాగానే ఉన్నా కడపలో జరుగుతున్నటువంటి ఈ వేడుక పనులకు సైతం ఆ జిల్లాలలో ఉండే నేతలు దూరంగా ఉన్నారనే చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. బీటెక్ రవి, ఎమ్మెల్యే మాధవి తో సహా పలువురు నేతలు కూడా దూరంగా ఉన్నారట.


ఇందుకు కారణం కమలాపురం ఎమ్మెల్యేకు పూర్తిస్థాయి బాధ్యతలు ఇవ్వడంతో వీరు ఆగ్రహంతో ఉన్నారని వినిపిస్తున్నాయి.మిగిలిన వారికి ఎవరికీ కూడా ఆ నేత ఎలాంటి పనులను కూడా అప్పగించలేదని తమకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పలేదని పలువురు నేతలు గుర్రుగా ఉన్నారట. మరి కొంతమంది నేతలను కావాలని దూరంగానే ఉంచారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కడపలో జరుగుతున్న ఈ మహానాడు సభకు సంబంధించి పనులకు ఇలా దూరంగా ఉండడంతో అసలు కడప టీడీపీలో ఏం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. మరి ఏ మేరకు ఈ మహానాడు సభను సక్సెస్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: