బీఆర్ఎస్ ఉద్యమ నినాదం మీద నిలబడిన పార్టీ. ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మూడవసారి  అధికారాన్ని కోల్పోయింది. ఇదే తరుణంలో పార్టీలో చీలికలు వచ్చాయని, కేసీఆర్ సొంత కూతురు కవితే  బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తుండడం గమనార్హం. ఈ మధ్యకాలంలో కవిత చేస్తున్న నినాదాలు, చేస్తున్న ప్రోగ్రామ్స్ చూస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు. నేను ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా ఇంకా నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా.. కొందరు పనిగట్టుకుని నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నాను అని రెచ్చగొడితే మరింత రెచ్చిపోతా.. నేను సామాజిక తెలంగాణ కావాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తోంది. దీన్ని బట్టి చూస్తే  బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రమే..

దొరల చేతిలో పాలన ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఈ తరుణంలో కవిత  సామాజిక తెలంగాణ ప్రస్తావన తీసుకురావడంతో పార్టీలో విభేదాలు వచ్చాయని అర్థమవుతుంది. ఈ విధంగా కవిత వ్యతిరేకంగా వెళుతుండడంతో ఆమెను పూర్తిగా పార్టీ నుంచి సైడ్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈవిడనే కాకుండా హరీష్ రావును కూడా కాస్త పక్కన పెట్టినట్టే ఈ వ్యవస్థ చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్న సమయంలోనే ఆ పార్టీకి బాస్ గా హరీష్ రావు ఉందామని ట్రై చేశాడు. కానీ ఇది గ్రహించిన కేసీఆర్  తన కొడుకును బాస్ చేయాలని హరీష్ రావుకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా కొన్నాళ్లపాటు పక్కన పెట్టేసాడు. ఆ తర్వాత హరీష్ రావు ఆ పార్టీలో అడ్జస్ట్మెంట్ అవుతూ ఏ పదవి ఇచ్చినా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.

ఇటీవల కాలంలో చూస్తే మాత్రం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అంతగా స్థానం ఇవ్వలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సభకు సంబంధించిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలలో, కటౌట్ లలో  హరీష్ రావు ఫోటో లేకుండానే ప్రింట్ చేశారు.. ఈ విధంగా హరీష్ రావును, కవితను  పార్టీ నుంచి సైడ్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. తాజాగా ఇష్యూ పై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ హరీష్ రావు, కవితలను కేటీఆర్ బయటకు పంపాలని చూస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కవితను ఆ పార్టీలో కరివేపాకుల చూస్తున్నారని తెలియజేశారు. త్వరలోనే బిఆర్ఎస్ మూడుముక్కలవుతుందని  అన్నారు. పార్టీలో  కవితకు సముచిత లేకపోవడం వల్లే ఈ విధంగా మాట్లాడుతోందని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: