
ఎన్నికలు లేకపోయినప్పటికీ ఈ యుద్ధాన్ని భారత్ కొని తెచ్చుకోలేదు.. ఫహల్గంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో అక్కడ 26 మంది అమాయకపు భారతీయులు మరణించడంతో భారత్ రగిలిపోయి మరి ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్తో తీర్చుకుంది. భారత్ ,పాకిస్తాన్ మధ్య యుద్ధం కాదు ఇది.. తీవ్రవాదులు వర్సెస్ మోదీ యుద్ధం అంటూ తెలియజేసేలా చేశారు. దీంతో భారత్ సత్త ఏంటో మరొకసారి అంతర్జాతీయంగా చర్చనీయంశంగా అయ్యేలా చేశారు మోదీ. భారత్ కు జరిగిన నష్టం తక్కువే అయినా పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను ప్రోత్సహించి భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. సుమారుగా 100 మంది టెర్రరిస్టులు కూడా మరణించారు. ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ కూడా చేసింది భారత్.
మన భూభాగం పైనుంచి 9 ఉగ్రవాదం స్థావరాలను నాశనం చేయగలిగారంటే ఇక భారత్ ఎలాంటి ప్లాన్ తో అటాచ్ చేసిందని విషయం చెప్పాల్సిన పనిలేదు. అది కూడా 15 రోజులలోనే ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పారు మోదీ. గతంలో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించిన ఇందిరా గాంధీ కూడా ఐరన్ లేడీగా నిలిచారు.. అలా మోదీ కూడా సింధూర్ అనే ఆపరేషన్ పేరు పెట్టి మహిళా అధికారుల చేత మీడియా సమావేశం పెట్టి మరి దాడులకు సంబంధించి బ్రీఫింగ్ ఇప్పించడం జరిగింది.
మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా హైలెట్ అయ్యిందని చెప్పవచ్చు. ప్రతి భారతీయుడు కూడా మరిచిపోలేని విధంగా వ్యవహరించారు.. మోదీ ఉంటే ఒక భరోసా ఉంటుందని నమ్మకాన్ని కలిగించేలా చేశారు. దీంతో మోదీ ఇమేజ్ కూడా పెరిగింది. కానీ కాల్పుల విరమణ తర్వాత మోదీ గ్రాఫ్ తగ్గింది అనే విధంగా మాట్లాడుతున్నారు..