గత ఏప్రిల్ 22 న భారత్ లోని పహల్గామ్ ఉగ్రవాదు దాడి తర్వాత భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రికత వాతావరణం నెలకొంది .. ప్రధానం గా పాకిస్తాన్ ఉగ్ర దాడికి దీటు గా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ , పాకిస్తాన్ అక్రమ కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరల పై వైమానిక దాడులు చేసి దాదాపు వందల మంది ఉగ్రవాదులను చంపేసింది ..


పహల్గాం ఉగ్ర దాడి కి ముందు హిందువు లు , ముస్లిం లు వేరంటూ సంచలన కామెంట్లు చేసిన‌ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్‌ అసిమ్‌ మునీర్‌ అహ్మద్‌ షా ఆ తర్వాత ఎక్కడా  కనిపించకుండా పోయారు .  కనీసం మీడియా సమావేశాల్లో నూ ఆయన ఎక్కడా పాల్గొనలేదు .. ఇదే క్రమం లో ఆయన దేశం వదిలి పారిపోయారు అంటూ సోషల్ మీడియా లో కూడా వార్తలు వచ్చాయి .  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కుటుంబం తో సహా దేశం విడిచి పారిపోయారని .  భారత్ దాడికి భయపడి పాకిస్తాన్ లోని బంకర్ లో తల దాచుకున్నారంటూ విమర్శలు కూడా వచ్చాయి .


అయితే భారత్ , పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పు లు విరమణ తర్వాత మళ్లీ ఆసిమ్‌ మునీర్ ఎట్టకేల కు బయట కు వచ్చారు .. ఆపరేషన్ సింధూరు లో గాయపడి న పాకిస్తాన్ ఆర్మీ సైనికుల ను ఆసిమ్‌ మునీర్ కలుస్తున్నారు .. ఎల్ ఓ సి వద్ద 50 + సైనికులు , వైమానిక దాడుల్లో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయినట్లు గా తెలుస్తుంది .. అయితే ఆపరేషన్ సిందూర్ లో చనిపోయిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల ను పాక్ ఇంత వరకు బయట పెట్టలేదు . . కానీ పాకిస్తాన్ ఈ వాస్తవాన్ని పదే పదే దాచిపెడుతోంది .



మరింత సమాచారం తెలుసుకోండి: