పాకిస్తాన్ నాటకాన్ని ప్రపంచంలో అన్ని మీడియా సంస్థలు చూసి నవ్వుకుంటున్నాయి.. అయితే పాకిస్థాన్ లో ఉండేవారు మాత్రం గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. నవ్వుకుంటున్న వారు కూడా ఉన్నారు.. కళ్ళ ఎదురుగా కనబడుతున్నటువంటి విధ్వంసకమైన సంఘటనలను చూసి ఇప్పుడు అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పాకిస్థాన్ ఉన్నదట. కానీ విజయోత్సవాలంటూ ఓడినటువంటి వాళ్ళు సంతోష కార్యక్రమాలు చేస్తూ ఉంటే.. గెలిచిన భారతదేశంలో నోటికి వచ్చిన కారు కూతలు కూసేవాళ్ళు ఉండడమే పాకిస్థాన్ కి సంతోషం.



పాకిస్థాన్ ఓడిపోయాము అని చెప్పేవారు ఎవరూ లేరు.. ముఖ్యంగా అక్కడ  ప్రతిపక్ష ప్రభుత్వం కూడా ఓడిపోయామని చెప్పలేదు.. అయితే ఇక్కడ గెలిచినా కూడా.. గెలిచాము అని చెప్పడానికి కుతకుత అని ఉడికి పోయేటువంటి విపక్షమే మన దేశానికి దరిద్రం అని విశ్లేషకులు తెలుపుతున్నారు.. పాకిస్థాన్ లో ఉండేటువంటి సైనిక స్థావరాలు ధ్వంసం అయినటువంటి మాట, అలాగే కేవలం 48 గంటలలో పాకిస్తాన్ తోక ముడిచే పరిస్థితి సృష్టించినటువంటి విధ్వంసం కేవలం భారత్ మాత్రమే చేసింది.. దీంతో పాకిస్థాన్ చివరికి అమెరికాని అప్పు ఆడుకొనే పరిస్థితి తెచ్చుకున్నది.. అన్వస్త్ర దేశం ఇంకొక అన్వస్తర దేశం  చేతిలో దారుణంగా నాలుగు రోజులలోనే ఓడిపోవడం అన్నటువంటిది ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు లేదు అన్నటువంటిది ప్రతి ఒక్క నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.


అయినప్పటికీ కూడా పాకిస్థాన్ మాత్రం యుద్ధం ఆగిపోలేదని కొద్ది రోజులు మాత్రమే కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నదని గంభీరంగా చెప్పుకుంటున్నప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం భయభ్రాంతులకు గురవుతున్నారని విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండియాలో కొంతమంది గూఢచారులను కూడా పాకిస్థాన్ పెట్టుకున్నట్లుగా అధికారులు గుర్తించారు ఇటీవలే ప్రముఖ యూట్యూబర్ గా పేరు పొందిన జ్యోతి మల్హోత్రా వంటి యూట్యూబర్ని కూడా అధికారులు కనుగొన్నారు.. ఇక ఈమెతో పాటు చాలా మంది ఉన్నారన్నట్టుగా గుర్తించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు బయట పెట్టబోతున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: