వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నైతికత అన్నది అప్పుడు జగన్ పాటించారు. అది రెండుచోట్ల అప్పుడు 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి.అటువంటి ఎన్నికలలో 10 కార్పొరేషన్లకు 10 వైసీపీ పార్టీని గెలుచుకుంది. జిల్లా పరిషత్ లో కూడా వైసిపి పార్టీనే గెలిచింది. మున్సిపాలిటీలలో కూడా 73 స్థానాలకు గెలిచింది. అయితే 2 చోట్ల ఓడిపోయింది. అలా ఓడిపోయిన వాటిలో తాడిపత్రి ఒకటి.. 16 ఓట్లు వైసిపికి.. 18 టిడిపి పార్టీకి వచ్చాయి. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు అప్పట్లో చేసి ఉంటే ఆ సీట్లను కూడా లాగేసుకోవడమే అన్నట్లుగా ఉండేది.


అయితే కేవలం తమకు ఒకే ఒక్క సీటు ఉన్నచోట కూడా కూటమి నేతలు అక్కడ స్థానాన్ని  కైవసం చేసుకుంటున్నారు.. దీంతో అనైతిక రాజకీయాలకు తెరతీసింది కూటమి ప్రభుత్వం. ఎవరు గెలిచిన చోట వారికి అవకాశం ఇవ్వాలనీ గతంలో జగన్ నైతిక విలువలను పాటించారు..అయితే ఇప్పుడు జరిగిన ఎన్నికలలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని మాజీ సీఎం జగన్ కూతమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. తాము ఎప్పుడూ కూడా  అలాంటివి చేయనీయలేదనీ తెలిపారు.. వాళ్లను గెలిపించాలని కోరుకున్నప్పుడు గెలిచిన వారినే ఉన్నివ్వాలని ఆరోజు జగన్ నైతిక విలువలను పాటించారని తెలిపారు.



అయితే ఈ రోజున జగన్ అదే విషయాన్ని తన మీటింగ్లో చెప్పుకొచ్చారు.. ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో బెదిరించి మరి సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి హింసలు పెట్టి, కిడ్నాప్ చేసి, పోలీసుల ద్వారా బెదిరించి అరాచక రాజకీయం చేస్తూ తమ సొంత పత్రికలలో గెలిచామంటూ రాసుకోవడానికి చేస్తున్న ఈ దాస్టికాలను ప్రస్తావించారు.. ఆరోజున తాడిపత్రిలో ఇలాంటి ఎన్నికలు జరిగితే.. తాను అనైతికతకు ఫోనని చెప్పాను.. ఆరోజున జేసీ ప్రభాకర్ రెడ్డిని ఊరు వదిలి పొమ్మని చెప్పలేదు.. అలాగే పెద్దారెడ్డికి సంబంధించి.. పెద్దారెడ్డి కూడా రెండు సీట్లే కదా అన్న లాగేద్దామని చెబితే.. వద్దని చెప్పానని జగన్ తెలిపారు. కానీ పెద్దారెడ్డి లాగుతాను అంటే ఆయననే హౌస్ అరెస్ట్ చేయించి మరి పెట్టానని తెలిపారు జగన్. టిడిపి పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిందని. ఇదే నేను పాటించిన నైతికత.. కానీ ఇప్పుడు అక్కడ పెద్దారెడ్డిని రానివ్వలేదు.. ఏపీ అంతటా కూడా నైతిక విలువలను అసలు పాటించలేదు కూటమి ప్రభుత్వం అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: