
అలాగే ఆమె కుటుంబంలో ఉన్న భర్త ఇద్దరు పిల్లలకు కూడా వైద్యులు కరోనా టెస్ట్ చేయగా ముగ్గురికి నెగిటివ్ రిజల్ట్ వచ్చిందట.. మహిళను వారం రోజులపాటు హోం క్వారెంట్ టైంలో ఉండాలి అంటూ వైద్యులు సూచించారు. మహిళా ఇంటి చుట్టు పరిసరాలలో కూడా వారందరికీ కరోనా పరీక్షలు చేయాలంటూ ప్రభుత్వం కూడా ఆదేశాలను జారీ చేసింది. పిఠాపురం కాలనీకి చెందిన ఈ మహిళ గత కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదని ఇబ్బంది పడుతూ ఉండేదట..వైద్యుల దగ్గరికి వెళ్ళగా.. మలేరియా, డెంగ్యూ అంటూ వైద్యులు పరీక్షలు చేశారట.
కానీ చివరికి కొవిడ్- 19 పాజిటివ్ అన్నట్లుగా నిర్ధారణ అయిందని వైద్యులు తెలియజేశారు. విశాఖపట్నంలో జరిగిన టెస్టులలో ఈమెకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు తెలియజేశారు. అయితే బాధితురాలు కోలుకున్నదని ఈ సాయంత్రానికి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఒక వారం రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలి అని వైద్యులు సూచించారు. ఇక ఆ కుటుంబం నివసిస్తున్న ఇంటి పరిసరాలలో కూడా మూడు బృందాలుగా వైద్యులు వెళ్లి మరి ప్రతి ఇంటిని సర్వే చేయించేలా చూస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆదేశాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. మరి రాబోయే రోజుల్లో మరేన్ని కేసులు ఏపీలో బయటపడతాయో చూడాలి.