ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఒకటైన జొమాటో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ జొమాటో ఫుడ్ యాప్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. జొమాటో ఇకపై దూరాన్ని బట్టి డెలివరీ ఛార్జీలను వసూలు చేయనుందని సమాచారం అందుతోంది. జొమాటో తాజాగా లాంగ్ డిస్టెన్స్ సర్వీస్ ఫీజును మొదలుపెట్టడం గమనార్హం.
 
దూరంగా ఉన్న హోటల్ లేదా రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇకపై ఎక్కువ మొత్తంలో ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఆర్డర్ విలువను బట్టి కూడా ఈ ఛార్జీలలో మార్పులు ఉండనున్నాయని సమాచారం
 
అయితే ఈ ఛార్జీల పెంపు విషయంలో జొమాటో యూజర్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది ఖర్చులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో జొమాటో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా సర్వీస్ ఛార్జీలు సైతం ఉండనున్నాయని సమాచారం అందుతోంది. జొమాటో పెంచిన ఛార్జీల గురించి ఏ విధంగా స్పందించనుందో చూడాల్సి ఉంది.
 
జొమాటో ఛార్జీలను పెంచిన నేపథ్యంలో ఇతర ఫుడ్ డెలివరీ యాప్స్ సైతం ఛార్జీలను ఇదే విధంగా పెంచే ఛాన్స్ అయితే ఉంది. ఛార్జీల పెంపు విషయంలో కొంతమంది యూజర్లు మాత్రం ఫైర్ అవుతున్నారు. ఇష్టానుసారం ఛార్జీలను పెంచడం వల్ల ఊహించని స్థాయిలో భారం పడుతుందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫుడ్ డెలివరీ యాప్స్ కు అలవాటు పడిన వాళ్లు ఎంత పెరిగినా పెరిగిన మొత్తాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: