తెలంగాణలో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీలో సరికొత్త విప్లవం రాబోతోందని  కొన్ని కొన్ని నడవడికలు గమనిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా 10 సంవత్సరాలు ఏకాధాటిగా రాష్ట్రాన్ని పాలించి ఎదురులేని లీడర్ గా ఉన్నటువంటి కేసీఆర్ కు సొంత తనయే తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో పొజిషన్ ఏంటో క్లియర్ గా చెప్పకుంటే తప్పకుండా మరో పార్టీ పెట్టి  పోటీ చేస్తానని కవిత యోచిస్తున్నట్టు సమాచారం. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే కేసిఆర్, కేటీఆర్,హరీష్ రావు, కవిత మాత్రమే కనిపించేవారు. కానీ అప్పటి నుంచి పార్టీ కుటుంబ పార్టీగా మారి ప్రజలకు కు కాస్త దూరం అయిపోయింది. 

ఇక 2023లో జరిగిన ఎన్నికల్లో పూర్తిగా అధికారం కోల్పోయింది. ఇలా మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించాలని కృషి చేస్తున్న తరుణంలో  కవిత అడ్డకాలు వేసింది. ఈ పార్టీలో నా పరిస్థితి ఏంటో చెప్పాలని ప్రశ్నించింది. కేసీఆర్ కు లేఖ రాసింది.ఆ లేఖ అనూహ్యంగా బయటపడడంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున రచ్చయిపోయింది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె వర్ణించింది. దీనిపై కేసీఆర్ స్పందించి తన పరిస్థితి ఏంటో చెప్పకుంటే తప్పకుండా తిరుగుబాటు తప్పదని, ఉద్యమకారులను కలుపుకొని కొత్త పార్టీ పెడతానని కవిత కేసీఆర్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది.

 బీఆర్ఎస్ లో తనకు మంచి పదవి ఇస్తేనే ఓకే లేదంటే తప్పకుండా పార్టీ పెడతానని గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఒకవేళ కవిత పార్టీ పెడితే పార్టీ పేరు తెలంగాణ జాగృతి అని పెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా  తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కవిత పార్టీ పెడితే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కేసీఆర్ కవితను బుజ్జగించి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా.. లేక ఏమైనా చేసుకో అని బయటికి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: