ప్రస్తుత కాలంలో సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నలుగురు నడిచే దారిలో నడిచి సక్సెస్ కావడం సులువైన విషయం కాదు. పశ్చిమ్ బంగా అనే ప్రాంతంలో ఒకప్పుడు బియ్యంతో పాటు గోధుమలు, ఆవాలు పండించేవారు. అయితే రైతులు ఒకే రకం పంటలు వేయడం వల్ల నష్టాలు మూటగట్టుకునేవారు.
 
ఆ సమయంలో సుకుమార్ బర్మన్ అనే రైతు 2007 సంవత్సరంలో తొలిసారి బిర్యానీ ఆకు సాగును మొదలుపెట్టారు. మూడేళ్ల తర్వాత బిర్యానీ ఆకును అమ్మితే క్వింటాల్ కు 2500 రూపాయలు వచ్చాయి. ఆ సమయానికి ఈ మొత్తం ఎక్కువే. ఇతర రైతులను సైతం సుకుమార్ బిర్యానీ ఆకు సాగు దిశగా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఏకంగా ఎనిమిది వందల ఎకరాల్లో బిర్యానీ ఆకు సాగవుతోంది.
 
ఒక్కరితో మొదలైన బిర్యానీ సాగు ఇప్పుడు లక్షల మందికి ఉపాధిని చూపిస్తుండటం గమనార్హం. ఇక్కడ నివశించే ప్రతి రైతు మూడేళ్లకు ఒకసారి 5 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. బిర్యానీ ఆకులలో బెంగాల్ వెరైటీ అనే కొత్త రకాన్ని వీళ్లు జత చేయడం జరిగింది. వీళ్ల సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
 
ప్రతిభ ఉంటే చిన్న వస్తువులతో కూడా కోట్లు సంపాదించవచ్చని ఈ గ్రామ వాసులు ప్రూవ్ చేస్తున్నారు. కొత్త పంటలు సాగు చేస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని తెలుస్తోంది. అయితే తెలివిగా పెట్టుబడులు పెడితే మాత్రం కచ్చితంగా మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చు. ఇతరులు వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో అడుగులు వేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. అందరూ కలిసి దీనిని 400 కోట్ల రూపాయల పరిశ్రమగా మార్చడం హాట్ టాపిక్ అవుతోంది. పంట మార్పిడి వల్ల భూములకు సైతం ఎంతో మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: