ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవలే చెన్నైలోని బిజెపి ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పరిపాలన వ్యవస్థపరమైన సమస్యలకు జమిలి ఎన్నికలు ఒకటే పరిష్కారం చూపుతాయని తెలియజేశారు. ప్రతి ఏటా కూడా దేశంలో ఎక్కడో ఒకచోట కచ్చితంగా ఎన్నికలు జరుగుతున్నాయని దీని ద్వారా అధికారంలో ఉన్నవారు ప్రజల పైన దృష్టి పెట్టలేకపోతున్నారని.. ఇలాంటి వ్యవస్థతో తాము కూడా అలసిపోయామని తెలుపుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.


ఐదేళ్లలో 800 రోజులు ఎన్నికలకే సరిపోతున్నాయని ఇక అభివృద్ధి జరగడం ఎక్కడ అంటూ ఇవన్నీ కూడా ప్రజల జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపుతాయని తెలిపారు. జమిలి ఎన్నికలు వస్తేనే అందరి రూపురేఖలు మారుతాయని తెలుపుతున్నారు. ఉదాహరణకు తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకున్నట్లు అయితే.. 2021 లో అసెంబ్లీ ఎన్నికలు జరగక ,2022లో స్థానిక ఎన్నికలు అలాగే 2024 లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇలాంటి తరహా ఎన్నికలు ఇబ్బందులను తెస్తాయని.. అలాగే ఏపీలో కూడా ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలు వేరువేరు సందర్భాలలో జరిగాయి. దీనివల్ల ఈ ఏడాది ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.


ప్రతి ఏడాది ఎన్నికల వల్ల మన దేశంలో 16.3 బిలియన్ డాలర్లు వృధా అవుతున్నదంటూ తెలిపారు. చాలామంది జమిలి ఎన్నికల పైన దుష్ప్రచారం చేస్తున్నారు.. గెలిస్తే సూపర్ అంటారు. గెలవకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాట్లాడుతున్నారు. ఇండియా కూటమి పార్టీలు మినహాయిస్తే మిగిలిన అన్ని పార్టీలు కూడా ఒకే దేశం ఒకే ఎన్నికకు మద్దతుగా నిలిచాయని పవన్ కళ్యాణ్ మళ్లీ గుర్తు చేశారు. అలాగే స్టాలిన్ కూడా ఈ విషయానికి మద్దతు పలకాలంటు చెన్నై వేదికగా తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీన్ని బట్టి చూస్తూ ఉంటే 2027 లోని జమిలి ఎన్నికలు వచ్చేందుకు ఆస్కారం ఉన్నదనే విధంగా పవన్ కళ్యాణ్ కి హింట్ ఇచ్చారనే విధంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను బట్టి బిజెపి పార్టీకి కూడా ఇప్పుడు మైలేజ్ మరింత పెరిగినట్టుగా కనిపిస్తోంది. మరి జమిలి ఎన్నికలు పై కేంద్రం ఎప్పుడనే విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: