నేడు "ఎన్టీఆర్" జయంతి .. ఈ సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు . ఆయన ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన గురించి గుర్తు చేసుకుంటున్నారు . ఇలాంటి మూమెంట్లోనే చాలామంది ఎన్టీఆర్ ను ఇష్టపడే వాళ్ళు ఆయన తర్వాత ఆయన స్థానం అందుకునే హీరో ఎవరు అంటూ చర్చించుకుంటున్నారు . చాలామంది జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఆ స్థానానికి సెట్ అవుతారు అంటుంటే .. మరి కొంతమంది బాలయ్య తప్పితే ఆ స్థానానికి ఎవరు సెట్ అవ్వరు సూట్ అవ్వలేరు అని మాట్లాడుకుంటున్నారు .


కానీ మధ్యలోకి స్టార్ హీరో ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు . వాళ్ళు మరెవరో కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . సినిమాలను పొలిటికల్ కెరియర్ను సమానంగా బ్యాలెన్స్ చేయాలి అంటే దానికి ఒక స్పెషల్ పవర్ ఉండాలి .. ఆ పవర్ పవన్ కళ్యాణ్ లో ఉంది అని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎలా సినిమాలను పాలిటిక్స్ ను సరీ సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లారో.. సేమ్ టు సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తున్నాడు అని..  పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎలాంటి స్థానాన్ని అందుకున్నారో ఇప్పుడు ఆయన అదే స్థానాన్ని అందుకోబోతున్నారని మాట్లాడుకుంటున్నారు .



అంతేకాదు ప్రజలకు కొత్త కొత్త పథకాలను అమలులోకి తీసుకొచ్చేలా చాలా డిఫరెంట్ గా పొలిటికల్ స్ట్రాటజీలను ప్లాన్ చేశాడు సీనియర్ ఎన్టీఆర్ గారు . ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా ట్రై చేస్తున్నారు.  ప్రజలకు ఎలాంటి పథకాలను అమలులోకి తీసుకురావాలి దాని ద్వారా ఎలా ప్రజలు లబ్ధి పొందుతారు అనే విషయాలపై స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు.  మరీ ముఖ్యంగా పాలిటిక్స్ లో తనా-మనా అనే భేదం లేకుండా అందరికీ సరి సమానంగా రూల్స్ కల్పించారు . ఇప్పుడు థియేటర్స్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిందే . అందుకే అప్పట్లో ఎన్టీఆర్ ఎలా పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేశారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాగే బ్యాలనెస్ చేస్తూ తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకుంటున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: