
ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఎంతోమందికి స్పూర్తిని ఇస్తుంది. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని నమ్మడంతో పాటు సీనియర్ ఎన్టీఆర్ ఆచరించారు. సీనియర్ ఎన్టీఆర్ క్రమశిక్షణ గురించి సైతం సినిమా ఇండస్ట్రీలో కథలుకథాలుగా చెప్పుకుంటారు. మేజర్ చంద్రకాంత్ షూట్ సమయంలో బయటకు వెళ్లాలంటే ఆయన రాఘవేంద్రరావుతో పాటు మోహన్ బాబు అనుమతి తీసుకొని వెళ్లారు.
సీనియర్ ఎన్టీఆర్ లో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే అందరినీ సమదృష్టితో చూసేవారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే స్పూర్తి కలిగించే విషయాలు ఆయన జీవితంలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ తన దర్పం ప్రదర్శించడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. తెలుగువారి పట్ల ఆయన చాలా సందర్భాల్లో మమకారన్ని చాటుకున్నారనే సంగతి తెలిసిందే.
సీనియర్ ఎన్టీఆర్ సినిమాల సక్సెస్ రేట్ కూడా ఎక్కువ అనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ సాధించిన విజయాలకు సంబంధించి కూడా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఎంతోమంది కొత్త దర్శకులకు తన కెరీర్ లో సీనియర్ ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ ఈతరం హీరోలకు సైతం స్పూర్తిగా నిలిచారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు