బిఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది..గత రెండు పర్యాయాలు కమ్మకిల్కుమానకుండా  పార్టీ వ్యవహారాలు సాగాయి. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచి పార్టీలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా కవిత రూపంలో బిఆర్ఎస్ లో పెద్ద చిచ్చే పుట్టింది.. కవిత కేసీఆర్ ను దేవుడిలా కొలుస్తూ మిగతా నాయకులను దయ్యాల్లా వర్ణిస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాను ఎప్పుడైనా రెడీగా ఉన్నానని కేసీఆర్ నాకు నాయకుడని మిగతా ఎవరు కూడా నాకు నాయకులు కాలేరని డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. ఇదే కాకుండా ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మంత్రి పదవి కూడా కావాలని  ఆమె అడిగినట్టు వార్తలు వచ్చాయి. కవిత తతంగం కొనసాగుతున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే తరుణంలో తాజాగా కవిత  సంచలన స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

కొంతమంది బిఆర్ఎస్ లో ఉండి కేసీఆర్ లాంటి పెద్ద లీడర్ నే నడిపిస్తున్నామని ఫీలవుతున్నారని ఆమె అన్నది. ఆయన కేసీఆర్ నడిపించే అంత పెద్ద వ్యక్తి కాదు కానీ, అలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అంటూ కవిత నిలదీసింది. ఆ వ్యక్తిలా నేను చిచోర రాజకీయాలు చేయనని చెప్పుకొచ్చింది. అప్పట్లో కెసిఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు తెలుపలేదని ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారని కవిత అడిగింది. అలా చిల్లర రాజకీయాలు చేస్తూ నేను బ్రతకనని హుందాగా ఉంటానని కవిత అన్నది.. నన్ను కెసిఆర్ కు దూరం చేసి వారు లాభపడాలని చూస్తున్నారని, కావాలనే ఎంపీ ఎన్నికల్లో నన్ను ఓడించారంటూ ఆరోపణలు చేస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ వ్యక్తి కేవలం ట్విట్స్ లో మాత్రమే స్పందిస్తూ, కింది స్థాయిలో పార్టీ బలోపేతం చేయడంలో విఫలమవుతున్నారని చెప్పకనే చెప్పింది.

ఆయన కంటే జాగృతి ద్వారా నేను పార్టీ బలోపేతానికి ఎక్కువగా సహకారం అందిస్తున్నానని అన్నది. నన్ను కెసిఆర్ కు దూరం చేసే కుట్ర చేస్తున్నారని, నేను కూడా కేసీఆర్ లాగా తిక్క దాన్ని పదవులు, పైసల కోసం ఆశించనని ఏ విషయం అయినా సూటిగా మాట్లాడుతానని తేల్చి చెప్పింది. వాళ్ల లాగా పదవులు పట్టుకొని వేలాడడం తనకు రాదని, ప్రజా క్షేత్రంలో ఎవరికి ఎంత బలము ఉందో త్వరలోనే నిర్ణయించబడుతుందని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం కవిత చేసిన కామెంట్స్  రాజకీయ దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యవహారం తిరిగి తిరిగి ఏ వైపు వెళ్తుందో ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: