
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే విధంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న హింస గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు . ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ కూడా ఆరోపించారు . ఇక ఈ సభలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి "ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ ప్రకటించారు". దీని పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో స్పందించారు.
ప్రధాని మోడీకి సహా బిజెపి పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేసింది . పెహల్గామ్ ఘటనపై దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది అన్నారు. అంతేకాదు ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రవాదానికి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడుతామని అన్నారు. "తామంతా ఒకటే ఉగ్రవాదాన్ని సహించేది లేదు ఐక్యతే మా బలం "అనే సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధుల విదేశాలలో పర్యటిస్తున్న సందర్భంలో ప్రధాని మోదీ ఇలా మాట్లాడడం చాలా చాలా బాధాకరమన్నారు. అంతేకాదు ఎప్పుడు ఏ క్షణంలో ఎన్నికలు వచ్చిన తాము రెడీ అని ఈసారి అధికారం చేపట్టేది మళ్లీ మేమె అంటూ గర్వంగా ధీమా వ్యక్తం చేశారు దీదీ .
అంతేనా ఒక స్టెప్ ముందుకేసి మోడీ పై సంచలన కామెంట్స్ చేశారు . మోడీ తనను తాను ఎప్పుడు "చాయ్ వాలా" అని అనుకుంటారు అని.. ఆ తర్వాత "గార్డు" అన్నారు అని .. ఇప్పుడు సిందూర్ అంటూ కొత్త రకమైన గేమ్ తెర పైకి తీసుకొస్తున్నారు అని ఎద్దేవా చేశారు . "సింధూరం మహిళలకు గర్వకారణం. ప్రతి మహిళకి తన భర్తనుంచే సింధూర్ తీసుకుంటుంది. అయితే సింధూరం ఇలా అమ్మకూడదు ప్రధాని జీ అంటూ అయినా మోదీకి భార్య లేదుగా ..అందుకే ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండదులే" అంటూ ఘాటుగా దీదీ..మోడీ పై మాట్లాడారు. ప్రజెంట్ దీదీ చేసిన కామెంత్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!