
గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది వృద్ధి రేటు తగ్గడం హాట్ టాపిక్ అవుతోంది. గతేడాది చివరి మూడు నెలలు తయారీ రంగం డీలా పడటం ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ ఫలితాలపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. అదే సమయంలో వ్యవసాయ రంగం సానుకూల ఫలితాలను అందుకోవడం మాత్రం ఊరటనిచ్చే అంశం అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
అయితే ప్రథమ థ్రైమాసికంలో భారత్ అంచనాలకు మించి రాణించిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మన దేశ జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. రాబోయే రోజుల్లో భారత్ జపాన్ ను సైతం అధిగమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతేడాది చివరి త్రైమాసికంలో నమోదైన వృద్ధి రేటు కేవలం 6.4 శాతంగా ఉంది. మన దేశ వృద్ధి రేటు ప్రపంచ ప్రధాన ఆర్థికవ్యవస్థల కంటే మెరుగైనది కావడం గమనార్హం.
మరి కొన్నేళ్లలో భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరే దిశగా అడుగులు వేస్తోంది. జీడీపీ వృద్ధి రేటు గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగిందని చెప్పుకొచ్చారు. నాలుగో త్రైమాసికంలో తయారీ, సేవల సామర్థ్యం పెంచిన పరిశ్రమలకు కృతజ్ఞతలు అని ఆమె వెల్లడించారు. కరోనా పరిణామాల్లోనూ, తర్వాత వ్యవసాయం రాణించిందని ఆమె కామెంట్లు చేశారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు