కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి జీఎస్టీని ప్రకటించింది. ఇదే తరుణంలో మే నెలలో ఏపీ జీఎస్టి వసూళ్లు  దారుణంగా తగ్గిపోయాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..ప్రతి దేశానికి, రాష్ట్రానికి జీఎస్టీ అనేది సంపట సృష్టికి కీలకం..వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సంపూర్ణంగా జరిగితే జీఎస్టి రేట్ అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా ప్రజల్లో కూడా డబ్బు అనేది ఉంటే రాష్ట్ర జీఎస్టి రేటు కూడా పెరుగుతుంది. ఇందులో సెంట్రల్, స్టేట్ జీఎస్టీలు ఉంటాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 నెలల్లో ఒక నెల లాభం నష్టం లేకుండా ఉన్నది. ఒక రెండు నెలలు లాభాలు వచ్చాయి. 

మిగతా తొమ్మిది నెలలు మైనస్ లోనే కొనసాగింది. తాజాగా మే పూర్తయి జూన్ లోకి అడుగుపెట్టినప్పుడు జీఎస్టీ నివేదిక ప్రకారం మైనస్ 2లోకి చేరింది. పోయిన ఏడాది  3890 కోట్ల రూపాయల జీఎస్టీ వస్తే, 3803 కోట్లు వచ్చింది. ఎస్ జి ఎస్ టి, ఐ జి జి ఎస్ టి వాటాలను పంపిణీ చేసిన తర్వాత మే నెల వరకు ఏపీకి 5388 కోట్ల జీఎస్టీ వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే 12% తక్కువగా వచ్చిందని చెప్పవచ్చు. తెలంగాణకు వచ్చేసరికి దాదాపు నాలుగు వేలకు పైగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.

దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే  దేశవ్యాప్తంగా 13.66% జీఎస్టి పెరిగితే  ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మైనస్ 2 లోకి వెళ్లిపోయింది. దేశవ్యాప్తంగా మైనస్ లోకి వెళ్ళిన రాష్ట్రాల వివరాలు చూస్తే దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు, మిజోరం, ఉత్తరాఖండ్ మైనస్ లోకి వెళ్ళాయి. జీఎస్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతగా తగ్గడానికి ప్రజల చేతుల్లో సంపద లేదని అర్థం చేసుకోవచ్చు.  ప్రజల చేతుల్లో సంపద సృష్టిస్తే తప్పకుండా జీఎస్టీ అనేది పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: