ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్న వారిలో వల్లభనేని వంశీ ఒకరు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనకంటూ ఒక ముద్రను వేసుకున్న ప్రస్తుతం మాత్రం అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఇకపోతే గత కొంత ఎన్ని రోజులుగా ఈయన ఆరోగ్యం బాగోలేదు అని అనేక ఆసుపత్రులను తిరుగుతున్నాడు. మొదట విజయవాడ ఆస్పత్రిలో ఈయనకు చికిత్సను అందించారు. ఆ తర్వాత గుంటూరు ఆస్పత్రిలో చికిత్సను అందించారు. కానీ ఈయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని వారు నివేదికను సమర్పించారు. ఇకపోతే అసలు విషయం లోకి వెళితే ... వల్లభనేని వంశీ పై పలు విషయాలలో కేసులు నమోదు అయ్యాయి. ఇక వాటిలో అన్ని సమస్యలకు సంబంధించి ఆయనకు ఇప్పటికే బెల్ వచ్చింది. కానీ నకిలీ పట్టా పాస్ పుస్తకాల విషయంలో ఆయనకు బెయిల్ రాలేదు.

ఇకపోతే ఆయనకు ప్రస్తుతం అనారోగ్యం బాగాలేదు అని సూచించడంతో ఆయన ఆయుష్ ఆసుపత్రిలో తనకు టెస్టులు చేయమని కోరడం , దానితో కోర్టు కూడా అందుకు అంగీకరించింది. కాకపోతే ఆయనకు టెస్టులు చేసిన పేపర్లను సీల్డ్ కవర్లో పెట్టి కోర్టుకు నివేదించాలి అని న్యాయస్థానం ఆదేశించింది. ఇకపోతే గత మూడు రోజులుగా వల్లబనేని వంశీ కి ఆయుష్ ఆసుపత్రి లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నిన్ననే ఆయనను హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. దానితో వల్లభనేని వంశీ జైలుకు వెళ్లిపోయాడు. ఇకపోతే ఆయనకు తాజాగా ఆయుష్ ఆసుపత్రిలో చేసిన టెస్టు రిపోర్ట్ లు అన్నీ కూడా ఐదవ తారీకు న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. ఆ అనంతరం ఇక వల్లభనేని వంశీ కి అనారోగ్య కారణాల వల్ల బెయిల్ వస్తుందా ..? లేక వేరే ఇతర కారణాల వల్ల బెయిల్ వస్తుందా అనేది జూన్ 5 వ తేదీన తేలిపోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn