
మొదటి దశలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం వంటి జిల్లాలలో ఈ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించబోతున్నారు. ఇంతే కాకుండా ఇంటితో పాటు వ్యాపార సంస్థలకు సరిత ఈ మీటర్లనే బిగించేందుకు సిద్ధమవుతున్నారట. అయితే వీటిని అటు ప్రజలతోపాటు వామపక్షాలు కూడా గట్టిగానే వ్యతిరేకిస్తున్నాయి. పేదల మధ్యతరగతి వర్గాలకు ఇది గుడిబండలా మారుతుందని పెను బారంలా మారుతుంది అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు.. ప్రీ పెయిడ్ మీటర్స్ అంటే ముందుగానే సొమ్ము చెల్లించాలి అలా చేయకపోతే కరెంటు ఆటోమేటిక్గా కట్ అవుతుందట.
అంతేకాకుండా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అధిక చార్జీలు కూడా వసూలు చేసే అవకాశం ఉందంటూ ప్రజలు వాపోతున్నారు.రాత్రి వేళలో అధిక విద్యుత్ వాడకం జరుగుతుంది ఆ సమయంలో ప్రత్యేకించి మరి రేట్లు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో స్మార్ట్ మీటర్ల దోపిడీ మొదలవుతోంది అంటూ చాలామంది నేతలు నిలదీస్తున్నారు. ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఒక్కొక్కటి 13 వేల రూపాయలు పడుతుందట వీటిని ప్రతినెలా కరెంటు బిల్లులోనే జమ చేసి కట్టించబోతున్నారని తెలుస్తోంది. గతంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటిని వ్యతిరేకించి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తామే అమలు చేయడంతో చాలామంది ఫైర్ అవుతున్నారు. మరి దీనిపైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.