దేశ రాజధాని ఢిల్లీలో షాదారా ప్రాంతంలో ఉన్న గురుద్వారా స్థలం తమదేనని ఆ స్థలం తమకు అప్పగించాలని కోరుతూ వక్ఫ్ బోర్డ్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయగా సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ను కొట్టేసింది. అక్కడ చాలా సంవత్సరాలుగా గురుద్వారా ఉందని దానిని అలాగే ఉండనివ్వాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ తీర్పుతో వక్ఫ్ బోర్డ్ కు భారీ షాక్ తగిలిందిగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలని సుప్రీం కోర్టు సూచనలు చేసింది. దాదాపుగా 15 సంవత్సరాల క్రితం ఢిల్లీ వక్ఫ్ బోర్ద్ షాదారా గురుద్వారా స్థలం మసీదు తకియా బబ్బర్ షా కు చెందుతుందని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు 2010 సంవత్సరం సెప్టెంబర్ లో ఈ పిటిషన్ ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
 
అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ సుప్రీం కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ గురించి సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ స్థలంలో చాలా సంవత్సరాలుగా గురుద్వారా ఉందని మీరే చెబుతున్నారని అందువల్ల దానిని అలాగే కొనసాగనివ్వాలని సుప్రీం కోర్టు ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సూచనలు చేసింది.
 
ఆ స్థలంలో 1947 సంవత్సరం నుంచి గురుద్వారా ఉన్నట్టు ఒక సాక్షి చెప్పిన సాక్ష్యాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకొని ఈ తీర్పును వెల్లడించడం కొసమెరుపు. సిక్కుల హక్కులను కాపాడే విధంగా సుప్రీం కోర్టు వ్యవహరించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. వక్ఫ్ బోర్డ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఒకింత కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: