మన భారతదేశం అంటేనే అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంటుంది. ఎప్పుడు అభివృద్ధిలో వెనక్కి పోయింది లేదు పూర్తిగా అభివృద్ధి చెంది ఇతర దేశాలకు సాయం చేసింది అయితే లేదు. గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది.. మన పొరుగు దేశాలైనటువంటి అమెరికా ఆస్ట్రేలియా జపాన్ లాంటి దేశాలు ఇప్పటికే ప్రపంచ దేశాలను తలదన్నే స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇండియా మాత్రం ఇంకా ఇదే పరిస్థితిలో ఉంటుంది. అలాగని మనదేశంలో కావలసిన సంపద లేదని కాదు, మేధావులు లేరని కాదు. ఇక్కడి నుంచి వెళ్లి ఇతర దేశాల్లో పనిచేసి అక్కడ దేశాలను డెవలప్ చేసే మేధావులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి భారతదేశం ఆస్ట్రేలియకి ఒక ఆఫర్ ఇచ్చింది. మరి దీనివల్ల భారత్ కు నష్టమా లాభమా అనేది ఇప్పుడు చూద్దాం.. 

సాధారణంగా షిఫ్ మేకింగ్, మెయింటెనెన్స్, రిపేర్, లాంటి సమస్యలు వచ్చినప్పుడు అవి అగ్రదేశాలలో చేయరు. ఇవి చేయాలంటే తప్పకుండా ఆ ప్రాంతమంతా పొల్యూట్ అవుతుంది. ముఖ్యంగా సముద్రాలలో పొల్యూషన్ ఎక్కువగా పెరిగిపోయి,  నీరంతా పాడైపోతుంది. దీనివల్ల మత్స్య సంపద నాశనం అయిపోయి, ఆ ప్రాంతంలో కురిసే వర్షాలు కూడా కలుషితమవుతాయని సైంటిస్టులు అంటున్నారు. నీరు కలుషితం కావడం వల్ల ఎండలు వచ్చినప్పుడు నీరు ఆవిరైపోయి మేఘాలకు చేరుతుంది. అవే వర్షాలు మళ్లీ  పొల్యూట్ గానే కురుస్తాయి. దీనివల్ల నేల కాలుష్యం, పంట కాలుష్యం అవ్వడమే  కాకుండా జనాలు కూడా అనేక సమస్యల బారిన పడతారు.

 ఇలాంటి విషయాల్లో అగ్ర దేశాలు చాలా వెనకడుగు వేస్తాయి. ఆ దేశాల్లో షిప్ రిపేర్, మెయింటెనెన్స్, మేకింగ్ వంటివి అస్సలు చేయరు. కానీ భారతదేశంలో మాత్రం ఆస్ట్రేలియాకు ఒక ఆఫర్ ఇచ్చింది. షిప్ రిపేర్ మేకింగ్ లాంటివి చేస్తామని చెప్పింది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ప్రజలకు పని దొరుకుతుందని, బిజినెస్ జరుగుతుందని ఈ విషయంలో ఆస్ట్రేలియాకు ఆఫర్ ఇచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా మన దేశం కాలుష్యాన్ని కావల్సుకొని ఆహ్వానించినట్టే అవుతుందని కొంతమంది శాస్త్రజ్ఞులు అంటున్నారు. దీనిపై ఇండియా ఆలోచన చేస్తుందా, లేదంటే ఉపాధి దొరికితే చాలు పొల్యూట్ అయిన ఏం కాదని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: