
ఈ ఘటన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలోని షాహిబా ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఘటనా స్థలంలో మంటలు ఎగసిపడుతూ ఉండడంతో అక్కడికి 12 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్తయత్నిస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు . అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జనావాసాల పై విమానం కుప్ప కూలినట్లు తెలుస్తుంది . భారీ ఎత్తున మంటలు ఎగసు పడుతూ ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది వాటి నార్పేందుకు ప్రయత్నిస్తున్నా కానీ ఇంకా పరిస్ధితి కంత్రోల్ లోకి రాలేదు.
విమానం వెనుక భాగం చెట్టును ఢీకొన్నట్టు తెలుస్తుంది . ఆ కారణంగానే ఇంత పెద్ద ప్రమాదం సంభవించినట్లు జాతీయ మీడియా చెబుతుంది . విమానం అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్తూ ఉండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం విమానంలో సుమారు 170 నుంచి 242 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు అంటూ తెలుస్తుంది . దీంతో ఒక్కసారిగా అహ్మదాబాద్ ఉలిక్కిపడింది. అంతేకాదు విమానంలో కొంతమంది ప్రయాణికులు స్పాట్లను చనిపోయినట్లు కూడా జాతియ మీడియా చెబుతుంది. కాగా విమానంలో నుంచి కొంతమందిని వెలికి తీసి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం . ఎయిర్ ఇండియా కి AI 171 చెందిన విమానం అహమ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరింది కానీ రన్వే పైనుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆకాశంలో కొద్ది దూరం వెళ్ళాక విమానం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది . దీంతో విమానం కూలిన పరిసర ప్రాంతాలలో పేలుడు వల్ల భారీగా పొగలు కొమ్ముకున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!