
గతంలో కూడా మన దేశంలో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 2020 కరోనా సమయంలో బోయింగ్ 737 - 800 విమానం దుబాయ్ నుంచి కేరళకు బయలుదేరగా భారీ వర్షం వల్ల విమానం లోయలో పది రెండుగా చీలిపోయింది. ఆ సమయంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా 100 మంది గాయాలపాలయ్యారు. 2010 మేలో మంగళూరులో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఐఎక్స్ 812 కుప్పకూలగా ఈ ప్రమాదంలో 158 మంది మృతి చెందారు.
1998 జులైలో అలయన్స్ ఎయిర్ ఫ్లయిట్ బోయింగ్ 737 2A8 ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పగా ఈ ప్రమాదంలో 55 మంది ప్రయాణికులు, ఐదుగురు స్థానికులు మరణించారు. 1996లో హర్యానాలో రెండు ఎయిర్ లైన్స్ విమానాలు ఢీ కొనగా ఈ ఘటనలో 340 మంది ప్రయాణికులు, సిబ్బంది మృతి చెందారు. 1993 ఏప్రిల్ లో ఇండియన్ ఎయిర్ లైన్ కు చెందిన విమానం టేకాఫ్ సమయంలో ప్రమాదానికి గురి కాగా ఈ ఘటనలో 118 మంది ప్రయాణికులు 55 మంది సిబ్బంది మృతి చెందారు.
బెంగళూరు విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం 605 కుప్పకూలింది. రన్ వేను తాకడం వాళ్ళ ఈ ప్రమాదం సంభవించింది. 1990 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన ప్రమాదంలో 146 మంది ప్రయాణికులతో పాటు 92 మంది సిబ్బంది చనిపోయారు. ఈ ప్రమాద ఘటనలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.