అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం జనావాసాల్లో పడింది. విమానానికి సంబంధించిన కొన్ని భాగాలు బీజే మెడికల్ కాలేజ్ యూజీ హాస్టల్ భవనాలపై పడ్డాయి. ఈ ఘటనలో ఏకంగా 20 మంది మెడికోలు మృతి చెందారని సమాచారం అందుతోంది. మృతి చెందిన విద్యార్థులలో ఎంబిబిఎస్ విద్యార్థులతో పాటు పీజీ విద్యార్థులు కూడా ఉన్నారని తెలుస్తోంది.

మరి కొందరు విద్యార్థులు తీవ్ర గాయాలపాలు అయ్యారని సమాచారం అందుతోంది.  అయితే ప్రమాదం జరిగిన కొంత సమయంలోనే  సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడం వల్ల  పలువురిని సురక్షితంగా బయటకు తీశారని తెలుస్తోంది. విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.  మెస్ లో ప్లేట్లు, ఆహారం చిందరవందరగా పడిపోవడం గమనార్హం.  

ప్రస్తుతం మూడు ఎన్డీఆర్ఫ్ బృందాలు  సహాయక చర్యలు చేపట్టాయని తెలుస్తోంది.  వడోదర నుంచి మరో రెండు బృందాలను ఇక్కడికి తరలిస్తున్నారని సమాచారం అందుతోంది.  ప్రమాద స్థలం నుంచి  అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వరకు  గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.  విమాన ప్రమాదం వల్ల  మెడికల్ కాలేజ్ కొంత భాగం కూలినట్టు తెలుస్తోంది.  ఇందుకు సంబంధించిన దృశ్యాలు పలువురిని కంటతడి పెట్టిస్తున్నాయి.

అహ్మదాబాద్ ఘర్ఘటన నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం వేడుక వాయిదా పడింది.  ఈ కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఎయిరిండియా ఎక్స్ లో  నలుపు రంగు డీపీతో సంతాపం తెలియజేసింది.  ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.  కేంద్ర మంత్రి అమిత్ షా ఘటన స్థలానికి బయలుదేరారని సమాచారం అందుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: